News August 5, 2024
అనంత ప్రజలను తిప్పలు పెట్టిన చేప

అనంతపురానికి పెన్నహోబిళం రిజర్వాయర్ నుంచి వచ్చే నీరు రాక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శనివారం సాయంత్రం నుంచి నీరు రాకపోవడంతో ఇంజినీరింగ్ అధికారులు మోటారుకు ఉన్న పైపులు తీసి 3గంటలు కష్టపడ్డా సమస్య ఏంటో తెలియలేదు. చివరకు మోటారుకు నీరందించే పంపులో 7కిలోల చేప ఇరుక్కొని ఉండటం గుర్తించారు. పంపు బిగించే పనులు పూర్తి చేసి ఈ సాయంత్రానికి నీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Similar News
News March 26, 2026
400 మంది విద్యార్థుల గైర్హాజరు

అనంతపురం జిల్లాలో బుధవారం పదో తరగతి భౌతిక శాస్త్రం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 143 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 32,485 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 32,085 మంది హాజరయ్యారు. 400 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. పర్యవేక్షణ కోసం 10 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. పరీక్షల నిర్వహణ క్రమబద్ధంగా జరిగిందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
News March 26, 2026
అనంత: మీ ఊరిలో తాగునీటి సమస్యా? ఈ నంబర్‌కు కాల్ చెయ్!

అనంతపురం కలెక్టర్ ఆదేశాల మేరకు తాగునీటి సమస్యల పరిష్కారం కోసం జిల్లా పంచాయతీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు డీపీవో నాగరాజు నాయుడు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరా సంబంధిత సమస్యలు ఎదురైతే ప్రజలు ఫోన్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు. ఫిర్యాదు చేసేందుకు 9550480972 సంప్రదించవచ్చన్నారు.
News March 26, 2026
అనంత: ఇవాళ రూ.లక్ష గెలుచుకునే ఛాన్స్!

పెద్దవడుగూరు మండలంలో రేపటి నుంచి రాష్ట్రస్థాయి రాతి దూలం లాగుడు పోటీలు జరగనున్నాయి. వీరభద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. మొత్తం 9 బహుమతులు ఉన్నాయి. మొదటి బహుమతి రూ.లక్ష ఇవ్వనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశామని గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు తెలిపారు.


