News August 5, 2024
త్వరలో కొత్త పెన్షన్లు: భట్టి

TG: కొత్త పెన్షన్లను త్వరలోనే అందజేస్తామని ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే కొత్త రేషన్ కార్డులూ ఇస్తామని, ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజావాణిలో ఎక్కువగా ఈ సమస్యలపైనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. చౌకధరల దుకాణాల్లో రేషన్ తీసుకునేందుకు, సంక్షేమ పథకాలను పొందేందుకు వేర్వేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న అంశంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని వివరించారు.
Similar News
News March 5, 2026
సిరిసిల్ల: ఇంటర్ పరీక్షలకు 79 మంది గైర్హాజరు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం MATHS B/History/Zoology PAPER-I పరీక్షల్లో 79 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులకు తెలిపారు. మొత్తం 3,531 మంది విద్యార్థులకు గాను 3,452 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర పరిశీలకుడు గురువారెడ్డి, DIEO, DEC పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.
News March 5, 2026
మంత్రి, ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం!

AP: కృష్ణా(D) గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండైంది. HYDకు వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అవుతుండగా ఇంజిన్‌లో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించి వెంటనే నిలిపేశారు. ఈ ఫ్లైట్‌లో మంత్రి గొట్టిపాటి రవి, MLAలు లక్ష్మీనారాయణ, పుల్లారావుతో పాటు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు రోడ్డు మార్గాన బయలుదేరగా ఇతరులకు వేరే విమానం ఏర్పాటు చేయనున్నట్లు ఇండిగో ప్రకటించింది.
News March 5, 2026
ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదు: మోదీ

దేశాల మధ్య సంఘర్షణను పరిష్కరించడానికి చట్టబద్ధ పాలన, చర్చలు, దౌత్యం ముఖ్యమని PM మోదీ చెప్పారు. రష్యాvsఉక్రెయిన్, US-ఇజ్రాయెల్vsఇరాన్ యుద్ధాలను ప్రస్తావిస్తూ.. ఏ వివాదానికైనా సైనిక చర్య పరిష్కారం కాదన్నారు. ఢిల్లీలో ఫిన్‌లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్‌తో కలిసి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ కామెంట్లు చేశారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో శాంతి కోసం చేసే ప్రయత్నాలకు సపోర్ట్ చేస్తామని ప్రకటించారు.


