News August 5, 2024
ఖాళీగా ఉంటే రాజమౌళికి బద్ధకం: రమ

అగ్రదర్శకుడు రాజమౌళికి పని రాక్షసుడిగా పేరుంది. కానీ ఖాళీ సమయాల్లో మాత్రం ఆయనకు మహా బద్ధకమట. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో రమా రాజమౌళి ఈ విషయాన్ని వెల్లడించారు. ‘షూటింగ్ లేదంటే ఆయనకు చాలా బద్ధకం. ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కోసారి బయటికెళ్లి గేమ్స్ ఆడతారు’ అని తెలిపారు. ఖాళీగా ఉంటే వ్యవసాయం, ఆటలు, కుటుంబంపైనే తన ఆలోచనలుంటాయని జక్కన్న వివరించారు. ప్రస్తుతం ఆయన SSMB29పై వర్క్ చేస్తున్నారు.
Similar News
News March 4, 2026
4 నెలల బాబుకు ప్రాణం పోశారు!

TG: ఆరోగ్య సమస్యలు, తక్కువ బరువు(2.8kgs)తో కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన 4నెలల బాబు ప్రాణాలను డాక్టర్లు కాపాడారు. కాలిన గాయాలు, రక్తహీనత, శ్వాస సమస్యలతో బాధపడుతున్న మడకం శివ అనే చిన్నారిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. 36 రోజుల చికిత్స తర్వాత బాలుడి బరువు 4.25kgsకి పెరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. చిన్నారికి మెరుగైన చికిత్స అందించిన డాక్టర్లపై ప్రశంసలొస్తున్నాయి.
News March 4, 2026
సౌదీపై దాడులు వద్దు.. ఇరాన్‌కు పాక్ వార్నింగ్!

గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తున్న ఇరాన్‌కు పాకిస్థాన్ వార్నింగ్ ఇచ్చింది. సౌదీ అరేబియాపై దాడులు చేయవద్దని చెప్పింది. సౌదీతో తమ రక్షణ ఒప్పందం గురించి గుర్తుచేసింది. తమకు వ్యతిరేకంగా సౌదీ భూభాగాన్ని ఉపయోగించకుండా చూడాలని ఇరాన్ తమకు చెప్పినట్లు పాక్ మంత్రి ఇషాక్‌ధర్ వెల్లడించారు. కాగా రెండు దేశాల్లో ఏ ఒక్కదానిపై దాడి జరిగినా రెండింటిపై జరిగినట్లుగా పరిగణించాలని సౌదీ-పాక్ <<17745790>>డీల్<<>> చేసుకున్న సంగతి తెలిసిందే.
News March 4, 2026
TPCC జాబితా: ఛాన్సు దక్కేదెవరికో!

TG: రాజ్యసభ సీటు కోసం INCలో పోటీ రసవత్తరంగా మారింది. రాష్ట్రం నుంచి సామాజిక వర్గాల వారీగా 16 పేర్లతో జాబితాను AICCకి పంపామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. వారిని ఢిల్లీకి పిలిచి మాట్లాడో లేదా ఫోన్లోనే చర్చించో తుది నిర్ణయం తీసుకోవచ్చన్నారు. కాగా VH, వేం నరేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి వంటి నేతలతో పాటు కొందరు ప్రముఖులనూ జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరికి ఛాన్సు దక్కుతుందో చూడాల్సిందే.


