News August 5, 2024
HYD: షాద్నగర్ ఘటనపై సీఎం సీరియస్
బంగారం చోరీ కేసులో ఓ దళిత మహిళ, ఆమె భర్తపై షాద్నగర్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేసిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటనకు బాధ్యులైన వారు ఎవరు తప్పించుకోలేరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాధితులకు అండగా ఉంటామన్నారు.
Similar News
News November 14, 2024
మాజీ ఉపరాష్ట్రపతి నివాసంలో కులగణన సర్వే
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసంలో కులగణన సర్వేను విజయవంతంగా నిర్వహించారు. సర్వేను ఎన్యుమరేటర్ ఉమాదేవి, శివ కుమార్ పర్యవేక్షణలో జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షణలో సర్కిల్ నోడల్ అధికారి సాయి శ్రీనివాస్ కలిసి పర్యవేక్షించారు. సర్వేలో పాల్గొనడానికి సమయాన్ని వెచ్చించినందుకు వెంకయ్య నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు.
News November 14, 2024
HYD: అక్కడేమో పూజలు.. ఇక్కడేమో ఇలా..!
VKB అనంతగిరి కొండల్లో పుట్టిన మూసికి అక్కడికి వెళ్లిన పర్యటకులు పూలు చల్లి పూజలు చేసి, స్వచ్ఛమైన నీటితో దైవాభిషేకం చేస్తున్నారు. మరి అదే మూసీ.. VKB ప్రాంతంలో పూజలు చేసిన వారే.. HYDలో మూసీని చూడగానే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. PCB ప్రమాణాలకు మించి మూసీ కలుషితమైంది. దీంతో HYDలో 55KM మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామని ప్రభుత్వం అంటుంది.
News November 13, 2024
HYD: సీపీ ఫోటోతో సైబర్ నేరగాళ్ల దందా.. జాగ్రత్త..!
HYD సీపీ ఆనంద్ ఫోటోతో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. ఫేక్ నంబర్లతో కాల్ చేసి, అమాయక వ్యక్తులకు వలవేస్తున్నారు. దీనిపై స్పందించిన సీపీ.. డబ్బు, బ్యాంకు వివరాలు అడగటం కోసం, ఇతర పర్సనల్ సమాచారం అడగటానికి ఏ అధికారి కాల్ చేయరని, అలాంటి వాటిని నమ్మొద్దని, సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.