News August 5, 2024

రెండేళ్ల నరకయాతన.. రూ.2 కోట్లు పెట్టినా బతకలేదు

image

రూ.200 కోసం మొదలైన గొడవతో యువకుడి ప్రాణం పోయింది. పోలీసుల ప్రకారం.. NLG జిల్లా చింతపల్లి మండలానికి చెందిన వెంకటేశ్ HYDలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. 2022 జులై 31న వివేక్‌రెడ్డి అనే వ్యక్తి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. బిల్ రూ.900 కాగా రూ.700 ఇవ్వడంతో గొడవైంది. వివేక్ 20 మంది స్నేహితులతో వెంకటేశ్‌పై దాడి చేశాడు. రూ.2కోట్ల మేర ఖర్చు చేసినా రెండేళ్లపాటు మంచాన పడ్డ వెంకటేశ్ ఆదివారం మృతిచెందాడు.

Similar News

News March 13, 2026

NLG: ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు.. 13,981 మంది హ్యాపీ

image

జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలు శుక్రవారంతో విజయవంతంగా ముగిశాయి. ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పేపర్లతో ఈ పరీక్షల పర్వం దిగ్విజయంగా పూర్తి కావడంతో విద్యార్థులు, అటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 11,783 మంది, వొకేషనల్ విభాగంలో 2,248 మంది.. మొత్తం 13,981 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షల నిర్వహణలో సహకరించిన ప్రతిఒక్కరికీ డీఐఈఓ ధన్యవాదాలు తెలిపారు.

News March 13, 2026

గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్‌కు 45 రోజుల గడువు

image

వంట గ్యాస్ సరఫరాపై ఒత్తిడి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క సిలిండర్ తర్వాత మరో సిలిండర్ బుకింగ్‌కు కనీసం 45 రోజుల గడువు ఉండాలని నిర్ణయించింది. అయితే పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న 25 రోజుల నిబంధనే కొనసాగుతోంది. గ్యాస్ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను నివారించడమే లక్ష్యంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.

News March 13, 2026

NLG: 62 పోస్టులు.. 16న ఇంటర్వ్యూలు

image

ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధనా సిబ్బంది కోసం ఈనెల 16న ప్రిన్సిపల్ ఛాంబర్‌లో వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. మెడికల్ కళాశాలలో ఒక ప్రొఫెసర్, 15 అసోసియేట్ ప్రొఫెసర్స్, 32 అసిస్టెంట్ ప్రొఫెసర్స్, 14 మంది ట్యూటర్స్‌ను తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు రిక్రూట్ చేసుకోనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రిన్సిపల్ కోరారు.