News August 5, 2024
బాండ్ల వేలంతో రూ.3వేల కోట్ల రుణం
TG: ఆర్బీఐ నుంచి బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం రూ.3 వేల కోట్ల రుణం తీసుకోనుంది. రూ.వెయ్యి కోట్ల విలువైన మూడు బాండ్లను వేర్వేరుగా 16 ఏళ్లు, 18 ఏళ్లు, 22 ఏళ్ల కాలానికి ఆర్బీఐకి రాష్ట్ర ఆర్థిక శాఖ జారీ చేసింది. రేపు వీటి వేలం అనంతరం ఆ మొత్తం ఖజానాకు చేరనుంది. కాగా ఈ ఏడాది జులై 24 నాటికి రూ.35,118 కోట్లు అప్పు తీసుకున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది.
Similar News
News January 16, 2025
పెన్&పేపర్ పద్ధతిలో NEET UG పరీక్ష
NEET UG పరీక్ష నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది పరీక్షను పెన్&పేపర్(OMR) పద్ధతిలో కండక్ట్ చేస్తామని ప్రకటించింది. పరీక్షను ఒకే రోజున ఒకే షిఫ్టులో నిర్వహిస్తామని తెలిపింది. 2019 నుంచి నీట్(UG) పరీక్షను NTA నిర్వహిస్తోంది. గతేడాది ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైనట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.
News January 16, 2025
వరుసగా నాలుగు రూ.100 కోట్ల సినిమాలు
నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. దీంతో వరుసగా ఆయన నటించిన నాలుగు సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాయి. బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అఖండ’, గోపీచంద్ మలినేని ‘వీరసింహారెడ్డి’, అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’, బాబీ ‘డాకు మహారాజ్’ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టాయి. ఈ నాలుగింట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి.
News January 16, 2025
ట్రంప్ ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు
US అధ్యక్షుడిగా ట్రంప్ ఈ నెల 20న వాషింగ్టన్ డీసీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని వీధుల్లో 48KM మేర 7 అడుగుల ఫెన్సింగ్‌ను నిర్మిస్తున్నారు. 25వేల మంది పోలీసులతోపాటు 7,800 మంది సైనికులను మోహరించనున్నారు. వైట్ హౌస్ చుట్టూ 2KM పరిధిలో పూర్తిగా లాక్‌డౌన్ విధించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే.