News August 5, 2024

ఆదిలాబాద్: యువతి ప్రాణం తీసిన బురద రోడ్డు

image

బురదరోడ్డు యువతి ప్రాణాలు తీసింది. వివరాలిలా.. గుడిహత్నూర్(M) న్యూపోమార్‌పేటకి చెందిన లక్ష్మి(26) శనివారం రాత్రి పాముకాటుకు గురైంది. ఈ విషయాన్ని తెల్లవారుజామున తల్లికి చెప్పింది. ఆ ఊరికి అంబులెన్స్ సదుపాయం లేదు. వెంటనే ఆమెను సమీపంలో ఉన్న వాగు వరకు ఎత్తుకొని వెళ్లి, ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించడంలో జాప్యం కావడంతో యువతి మృతి చెందింది. ఆస్పత్రికి చేరేందుకు 13కి.మీకు 2గ. పట్టింది.

Similar News

News March 13, 2026

ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుపై వీడని ఉత్కంఠ

image

ADB విమానాశ్రయ భూసేకరణ వ్యవహారం గందరగోళంగా మారింది. బ్లూప్రింట్ సిద్ధమైందని నేతలు చెబుతుండగా, తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని కలెక్టర్‌ స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది. రన్‌వే విస్తరణకు 249.81 ఎకరాలు అవసరం కానుంది. దీంతో భూములు ఎటువైపు పోతాయో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనతో బాధితుల్లో భయం పెరిగింది. స్పష్టత ఇవ్వాలని ప్రజలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.

News March 13, 2026

14న ఇన్నోవేషన్ పంచాయత్ కార్యక్రమం : ADB కలెక్టర్

image

జిల్లాలోని యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు పనిచేస్తున్న తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 14న కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉదయం ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.