News August 5, 2024

OLYMPICS: భారత్ ఆటగాడిపై ఒక మ్యాచ్ నిషేధం

image

ఒలింపిక్స్‌లో <<13775835>>అదరగొడుతున్న<<>> భారత హాకీ టీమ్‌కు షాక్ తగిలింది. బ్రిటన్‌తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రెడ్ కార్డ్ పొందిన డిఫెండర్ అమిత్ రోహిదాస్‌పై FIH ఒక మ్యాచ్ నిషేధం విధించింది. దీంతో రేపు జరిగే సెమీ ఫైనల్‌కు అతను దూరం కానున్నారు. బ్రిటన్ ప్లేయర్ కల్నన్ తలకు అమిత్ హాకీ స్టిక్ తగలడంతో రిఫరీ రెడ్ కార్డు చూపించిన విషయం తెలిసిందే. దీన్ని హాకీ ఇండియా ఛాలెంజ్ చేయగా, ఇంకా నిర్ణయం వెలువడలేదు.

Similar News

News March 15, 2026

అభిషేక్, నేను అగ్ని లాంటోళ్లం: సంజు శాంసన్

image

అభిషేక్ శర్మ, తాను ఐస్-ఫైర్‌లా ఉండమని, తాము కలిస్తే అగ్నికి అగ్ని తోడైనట్లేనని సంజూ శాంసన్ అన్నారు. ‘ఓపెనింగ్‌లో కొన్నిసార్లు నేను, ఇంకొన్నిసార్లు అభిషేక్ దూకుడుగా ఆడాం. 2024 నుంచి ఇదే చేస్తున్నాం’ అని ఇండియా టుడే కాంక్లేవ్‌లో చెప్పారు. ఇంతకుముందు అభిషేక్ ఫాలోయింగ్‌ను చూసి అసూయపడేవాళ్లమని పేర్కొన్నారు. జట్టులో అతడో సూపర్ స్టార్ అని, త్వరగా పెళ్లి చేసుకోవాలని జోక్ చేశారు.

News March 15, 2026

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్!

image

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మరిన్ని సౌకర్యాలను TTD అందుబాటులోకి తీసుకొస్తోంది. వసతి గృహాల్లో దిండు, దుప్పటి, చాప, బెడ్‌షీట్‌లను ఇవ్వనుంది. తొలుత నందకంలో ఇవ్వడం ప్రారంభించగా భక్తుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో వకుళామాత, పాంచజన్యం, కౌస్తుభం తదితర గెస్ట్‌హౌసుల్లోనూ అందజేయాలని నిర్ణయించింది. దుప్పటి-₹10, 2 దిండ్లు-₹10, చాప-₹10, బెడ్‌షీట్‌-₹20 చొప్పున చెల్లించి తీసుకోవచ్చు.