News August 5, 2024
గుడ్‌న్యూస్.. ఆ విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్‌మెంట్

TG: పాలిటెక్నిక్ సీట్ల భర్తీలో భాగంగా ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా సీట్లు మార్చుకున్న విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇది వరకు ఇంటర్నల్ స్లైడింగ్ కాలేజీలే నిర్వహించడంతో రీయింబర్స్‌మెంట్ వచ్చేది కాదు. కాగా ఇవాళ్టి నుంచి ఈ సీట్ల మార్పు ప్రక్రియ మొదలుకానుంది. మరోవైపు మిగిలిపోయిన సీట్లకు 8 నుంచి 11వరకు దరఖాస్తులు స్వీకరించి 12న స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తారు.
Similar News
News January 15, 2026
సంక్రాంతికి అరిసెలు ఎందుకు చేస్తారు?

సంక్రాంతి పంటల పండుగ కాబట్టి కొత్తగా చేతికి వచ్చిన బియ్యం, బెల్లం, నువ్వులSతో అరిసెలు చేస్తారు. చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని, శక్తిని, ఐరన్‌ను ఈ పదార్థాలు అందిస్తాయి. అరిసెలు ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల, పండుగకు వచ్చే అతిథులకు, అత్తారింటికి వెళ్లే అల్లుళ్లకు వీటిని ప్రేమపూర్వకంగా ఇస్తుంటారు. సంప్రదాయం ప్రకారం శుభకార్యాలకు, పండుగలకు అరిసెను ఒక సంపూర్ణమైన, మంగళకరమైన పిండివంటగా భావిస్తారు.
News January 15, 2026
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఝార్ఖండ్‌లో ఉద్యోగాలు

<
News January 15, 2026
పండుగ వేళ ఖాతాల్లోకి డబ్బులు

AP: సంక్రాంతి వేళ ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలో డబ్బులు జమవుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న DA, డీఆర్ ఎరియర్లు, సరెండర్ లీవుల మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు అందుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5.70లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని ఆర్థిక శాఖ చెబుతోంది. ఒక్కో ఉద్యోగికి రూ.70వేల నుంచి రూ.80వేల వరకు అకౌంట్లో పడుతున్నట్లు సమాచారం. పలువురు కాంట్రాక్టర్లకూ పెండింగ్ బిల్లులు రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది.


