News August 5, 2024

నెల్లూరు క్లబ్ పాలకవర్గానికి 18 నామినేషన్‌లు

image

నెల్లూరు క్లబ్ ఎన్నికలకు సంబంధించి పాలకవర్గ ఎన్నికల ప్రక్రియ వాడివేడిగా ప్రారంభమైంది. నెల్లూరు క్లబ్ సంబంధించి మొత్తం 18 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారి వసంత కృష్ణ ప్రసాద్ పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నట్లు ఆమోదముద్ర వేశారు. సోమవారం నామినేషన్ ఉపసంహరణ కార్యక్రమం జరగనుంది.

Similar News

News February 19, 2026

ప్రభుత్వానికి కాకాణి సవాల్

image

ఇందాపూర్ డెయిరీ వ్యవహారంపై మండలిలో చర్చకు ప్రభుత్వం భయపడుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. టీటీడీ నిధులు హెరిటేజ్‌కు మళ్లించారనే అనుమానాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యి ముసుగులో చంద్రబాబు రాజకీయ కుట్ర చేశారని విమర్శించారు. రాష్ట్ర అప్పులు, 22–ఏ భూముల అంశాలపై చర్చకు సిద్ధమని, ప్రభుత్వం దమ్ముంటే ముందుకు రావాలని సవాల్ విసిరారు.

News February 19, 2026

నెల్లూరు: టన్నుల్లో కవర్లు.. దొరికేది కేజీల్లోనే

image

నెల్లూరులో ప్లాస్టిక్ నిషేధం ఎక్కడా అమలు కావడం లేదు. 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించినా విక్రయాలు ఆగడం లేదు. సిటీలో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ నిల్వలు ఉన్నా అధికారులు మంగళవారం 400 కేజీలే పట్టుకోవడం గమనార్హం. విక్రయదారులకు రూ.1.40 లక్షల ఫైన్ వేశారు. కొండాల్ని తవ్వి ఎలుకను పడుతున్నట్టుగా అధికారుల తీరు ఉందని విమర్శిస్తున్నారు. కవర్ల తయారీ కంపెనీలపై దాడు చేయాలని కోరుతున్నారు.