News August 5, 2024
మోక్షజ్ఞ సరసన ఖుషీ కపూర్?
హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా దివంగత శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుందట. ఇండియన్ మైథాలజీలో ఉన్న పాత్రల ఆధారంగా సూపర్ హీరో నేపథ్యంలో మూవీ ఉంటుందని టాక్.
Similar News
News January 16, 2025
APPLY.. 251 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
AP: గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు డీసీసీబీల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 50 అసిస్టెంట్ మేనేజర్, 201 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆప్కాబ్ <
News January 16, 2025
సెల్యూట్ ISRO: నాలుగో దేశంగా ఎలైట్ క్లబ్‌లోకి భారత్
భారత్ అద్భుతం చేసింది. స్పేస్ డాకింగ్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించిన నాలుగో దేశంగా అవతరించింది. US, రష్యా, చైనా సరసన నిలిచింది. SpaDeX విజయవంతమైనట్టు ISRO ప్రకటించడం తెలిసిందే. స్పేస్‌లో 2 వేర్వేరు శాటిలైట్లను అనుసంధానంతో సింగిల్ ఆబ్జెక్ట్‌గా మార్చేసింది. ఛైర్మన్ నారాయణన్, మోదీ, కేంద్ర మంత్రులు ISRO సైంటిస్టులను అభినందించారు. స్పేస్ స్టేషన్, చంద్రయాన్ 4, గగన్‌యాన్‌కు ఇది మార్గం సుగమం చేసిందన్నారు.
News January 16, 2025
గ్రౌండ్ స్టాఫ్‌కు MCA జంబో గిఫ్ట్ హాంపర్స్.. ఏమేం ఉన్నాయంటే?
వాంఖడే స్టేడియానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ 178 మంది గ్రౌండ్ స్టాఫ్‌కు జంబో గిఫ్ట్ హాంపర్స్ అందజేసింది. ఇందులో 5 కిలోల చొప్పున గోధుమ పిండి, బియ్యం, పప్పు, ఒక మిక్సర్ గ్రైండర్, హైడ్రేషన్ కిట్స్, బ్యాక్ ప్యాక్స్, కిట్ బ్యాగ్, టవల్స్, పెన్స్, నోట్ పాడ్స్, బెడ్ షీట్స్, ట్రాక్ పాంట్స్, జాకెట్స్, సన్ గ్లాసెస్, హాట్స్, రెయిన్ కోట్, అంబ్రెల్లా, సన్ స్క్రీన్ వంటివి ఉన్నాయి.