News August 5, 2024

దళిత మహిళపై ఇంత దాష్టీకమా?: KTR

image

TG: షాద్ నగర్‌లో ఎస్సీ <<13778704>>మహిళపై<<>> పోలీసుల దాడిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దళిత మహిళపై ఇంత దాష్టీకమా? ఇదేనా ఇందిరమ్మ పాలనా? ప్రజాపాలనా? దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? కుమారుడి ముందే ఆమెను చిత్రహింసలు పెడతారా? ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. మహిళలను గౌరవించకపోయినా ఫర్వాలేదు కానీ దౌర్జన్యాలు మాత్రం చేయొద్దు’ అని తెలిపారు.

Similar News

News March 17, 2026

20 లక్షల ఉద్యోగాలే టార్గెట్: లోకేశ్

image

AP: పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. మంగళగిరిలో ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు(APEDB) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఉద్యోగాల కల్పనే సింగిల్ అజెండాగా ఉండాలన్నారు. ఒప్పందాలు కాకుండా పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలని ఆదేశించారు.

News March 17, 2026

పాక్ దాడి పిరికిపంద చర్య: భారత్

image

అఫ్గానిస్థాన్‌లోని ఆస్పత్రిపై <<19403539>>పాకిస్థాన్ దాడిని<<>> భారత్ ఖండించింది. రంజాన్ వేళ ఇలా చేయడం దారుణమని మండిపడింది. దీన్ని అఫ్గాన్ సార్వభౌమత్వంపై దాడిగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఇది మిలిటరీ దాడి కాదు మారణహోమమని పేర్కొంది. ఇదొక పిరికిపంద చర్యగా అభివర్ణించింది. కాగా పాక్ దాడిలో దాదాపు 400 మంది అమాయకులు మరణించారు.

News March 17, 2026

KTR వ్యాఖ్యలకు కోమటిరెడ్డి కౌంటర్

image

TG: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు <<19405508>>ఎందుకు<<>> చెప్పాలన్న KTR వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వనందుకు, మేం కొత్త కార్డులతో పాటు సన్నబియ్యం ఇస్తున్నందుకు KTR ధన్యవాదాలు చెప్పాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నందుకు థాంక్స్ చెప్పాలి’ అని స్పష్టం చేశారు.