News August 5, 2024

బ్రాండ్ ఏపీ వాల్యూను దెబ్బతీసేలా YCP పాలన: సీఎం చంద్రబాబు

image

AP: అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్లాలని CM చంద్రబాబు సూచించారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ.. ‘ప్రజావేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం విధ్వంసం మొదలుపెట్టింది. పనిచేసే అధికారులను పక్కన పెట్టి బ్లాక్‌మెయిల్ చేసింది. వారి మనోభావాలు దెబ్బతీసింది. అన్ని రంగాల్లోనూ విధ్వంసం చేసింది. బ్రాండ్ ఏపీ వాల్యూను దెబ్బతీసేలా గత ఐదేళ్ల పాలన సాగింది’ అని మండిపడ్డారు.

Similar News

News March 27, 2026

ప్రతి చిన్న విషయానికి సారీ అక్కర్లేదు: సమంత

image

ఒకే పరిస్థితి ఎదురైనప్పుడు మగాళ్లతో పోలిస్తే మహిళలు 10రెట్లు ఎక్కువగా సారీ చెబుతున్నారని నటి సమంత అన్నారు. ప్రతి చిన్న విషయానికి సారీ చెప్పాల్సిన అవసరం లేదని, తమను తాము తగ్గించుకోవడం ఆపాలని కోరారు. ఇక మూవీ ఇండస్ట్రీలో లేడీ యాక్టర్లు గుర్తింపునకు రెట్టింపు కష్టపడాల్సి వస్తోందని చెప్పారు. లేడీ ఓరియంటెడ్ మూవీలను రిస్క్‌లాగా చూడటం ఆపాలని ముంబైలో జరిగిన ఉమెన్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాంలో తెలిపారు.

News March 27, 2026

బ్లడ్‌బాత్.. ₹9 లక్షల కోట్లు ఆవిరి

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలు చవిచూశాయి. నిఫ్టీ 487 పాయింట్లు కోల్పోయి 22,819 వద్ద, సెన్సెక్స్ 1,690 పాయింట్ల నష్టంతో 73,583 వద్ద ముగిశాయి. దీంతో ఒక్కరోజే ₹9 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. టాటా మోటార్స్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోగా, ONGC, TCS, విప్రో, ఎయిర్‌టెల్, కోల్ ఇండియా షేర్లు లాభపడ్డాయి. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్ఠానికి(94.82) పడిపోయింది.