News August 5, 2024
2024 ఎన్నికల కౌంటింగ్‌పై ఈసీ ప్రకటన

గత సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లకు కౌంటింగ్ జరిపిన ఓట్లకు భారీ వ్యత్యాసం ఉందంటూ వస్తున్న ఆరోపణలను EC ఖండించింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ సహా పలువిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఈసీ స్పష్టంచేసింది. తాత్కాలిక గణాంకాలను, ఓటింగ్ ముగిశాక ప్రకటించిన గణాంకాలతో పోలుస్తున్నారని తప్పుబట్టింది.
Similar News
News March 21, 2026
వచ్చే వారం భీకర దాడులు: ఇజ్రాయెల్

పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించట్లేదు. వచ్చే వారం ఇరాన్‌పై దాడుల తీవ్రతను పెంచుతామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ వెల్లడించారు. ఇరాన్ అడ్మినిస్ట్రేషన్, కమాండర్లు, కీలక స్థావరాలను టార్గెట్ చేస్తామన్నారు. ఇరాన్‌పై దాడులను తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే కట్జ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
News March 21, 2026
ఆకాశంలోనే జీవితం.. కాపురం కూడా!

ప్రకృతిలో ‘కామన్ స్విఫ్ట్’ అనే పక్షి ఓ అద్భుతం. ఏకధాటిగా 10 నెలల పాటు భూమిపై వాలకుండా ఆకాశంలోనే జీవించగలిగే సామర్థ్యం దీని సొంతం. వింత ఏమిటంటే.. ఇది గాలిలోనే ఆహారం తింటుంది, జతకడుతుంది, చివరికి ఎగురుతూనే నిద్రపోతుంది. కేవలం గుడ్లు పెట్టడానికి మాత్రమే ఈ పక్షి నేలపైకి వస్తుంది. మెదడులో సగభాగాన్ని అలర్ట్‌గా ఉంచి గాల్లోనే నిద్రపోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో
News March 21, 2026
అంగారకుడిపై ఒకప్పుడు పుష్కలంగా నీళ్లు!

మానవులు జీవించడానికి అనుకూలమైన గ్రహాన్ని అన్వేషించడంలో కీలక పురోగతి లభించింది. అంగారకుడిపై ఒకప్పుడు నీరు పుష్కలంగా ప్రవహించిందనడానికి నాసా సైంటిస్టులు కొత్త ఆధారాలు కనుగొన్నారు. నాసా 2020లో ప్రయోగించిన Perseverance రోవర్ మార్స్‌లోని జెజెరో క్రేటర్‌లో 6.1KM ప్రయాణించి 35M లోతున భౌగోళిక నిర్మాణాలను విశ్లేషించింది. అక్కడ 3.7-4.2 బిలియన్ ఏళ్ల కిందట ఓ సరస్సు ఉండేదని నిర్ధారించింది.


