News August 5, 2024
పెద్దపంజాని: రోడ్డు ప్రమాదంలో MCA విద్యార్థి మృతి

పెద్దపంజాని మండలం బసవరాజుకండ్రిగ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన MCA విద్యార్థి సాయి కిరణ్ (23) బైక్‌పై వెళుతుండగా పలమనేరు-పుంగనూరు జాతీయ రహదారి వద్ద ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో సాయికిరణ్ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News April 1, 2026
చిత్తూరు జిల్లాలో మర్డర్..!

చిత్తూరు జిల్లాలో అదృశ్యమైన మహిళ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. పెద్దపంజాణి మండలం ముద్దేపల్లికి చెందిన చంద్రమ్మ వడ్డీ వ్యాపారం చేసేది. ఈక్రమంలో రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారించగా సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి బైక్‌పై తీసుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు అతడిని విచారించగా హత్య చేసి జగమర్ల అడవిలో పారవేసినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.

చిత్తూరు జిల్లాలో 23 ఉద్యోగాలకు నోటిఫికేషన్

చిత్తూరు జిల్లాలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి కలెక్టర్ సుమిత్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రేడ్-3 ఏఎన్ఎం-20, ఆఫీస్ సబార్డినేట్-2, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్-1 మొత్తంగా 23 పోస్టులను భర్తీ చేస్తారు. 18 ఏళ్లు నిండి 52 ఏళ్ల లోపు ఉన్న దివ్యాంగులు మాత్రమే అర్హులు. ఏప్రిల్ 4వ తేదీ లోపు దరఖాస్తులను చిత్తూరు కలెక్టరేట్‌కు పంపించాలి. వివరాలకు ఇక్కడ <