News August 5, 2024
గుడివాడ: కాలువలో పడి యువకుడి మృతి

గుడివాడలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. బండి ప్రేమ్ కుమార్ (26) సోమవారం పెద్ద కాలువలో పడి బైక్ మెకానిక్ మృతి చెందాడు. అతను ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడని స్థానికులు చెప్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రేమ్ కుమార్ మృతితో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Similar News
News March 24, 2026
బాలల సంక్షేమం కోసం చర్యలు తప్పవు: కలెక్టర్

బాలల సంక్షేమం, సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. బాల్యవివాహాలు, పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు పోక్సో, జువెనైల్ జస్టిస్ చట్టాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సమాచారం అందగానే అధికారులు వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఆధార్ లేని అనాధ పిల్లలకు తక్షణమే కార్డులు మంజూరు చేయాలని సూచించారు.
News March 23, 2026
మెరుగైన పారిశుద్ధ్యం నిర్వహణకు చర్యలు: కలెక్టర్

జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ PGRS హాలులో ప్రభుత్వ వసతి గృహాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించాలన్నారు.
News March 23, 2026
మొవ్వలో షార్ట్ సర్కూట్.. 3 గృహాలు దగ్ధం

మొవ్వ మండలం కాజ శివారు కుళాయి గుంటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 3 గృహాలు దగ్ధమయ్యాయి. విలువైన వస్తు సామగ్రి, నగదు, బంగారు ఆభరణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధితులు చందోలు ఏసు పాదం, కొమ్ముకూరి వరప్రసాద్, వేమూరి ఇజ్రాయేల్‌కు చెందిన గృహాలు అగ్ని ప్రమాదానికి గురవడంతో రూ.లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. ఈ ఘటనను VRO గోపికృష్ణ MRO మస్తాన్‌కు లిఖితపూర్వకంగా తెలియజేశారు.


