News August 5, 2024
అవినీతిని ప్రక్షాళన చేయండి: మంత్రి ఆనం

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మొదటిసారి జరిగిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఆనం మాట్లాడుతూ.. దేవాదాయ శాఖలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రక్షాళన చేయాలని ఆయన తెలిపారు.
Similar News
News January 16, 2026
నెల్లూరు టీడీపీ నేత మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

నెల్లూరు సిటీ టీడీపీ నేత, 42, 43వ క్లస్టర్ ఇంఛార్జ్ మహమ్మద్ జాకీర్ షరీఫ్ మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. నెల్లూరు వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో జాకీర్ గాయపడి ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జాకీర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి… వారి కుటుంబంలో విషాదం నెలకొనడం బాధాకరమని అన్నారు.
News January 16, 2026
BREAKING.. నెల్లూరు: బీచ్‌లో నలుగురు గల్లంతు..

అల్లూరు మండలం ఇసుకపల్లి సముద్ర తీరాన ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఒక మృతదేహాన్ని మత్స్యకారులు గుర్తించి సముద్రపు ఒడ్డుకు తీసుకొచ్చారు. మరో ముగ్గురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పండుగ కావడంతో అల్లూరు పంచాయతీకి చెందిన నలుగురు యువకులు ఈతకు వెళ్లి ఆలల ఉధృతికి గల్లంతయ్యారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని మృతదేహాన్ని మత్స్యకారులు బయటికి తీసుకొచ్చారు.
News January 16, 2026
కనుమ పండుగ విశిష్టత మీకు తెలుసా..?

సంక్రాంతి వరసలో వచ్చే చివరి పండుగను కనుమ పండుగ అంటారు. దీనినే పశువుల పండగ అనికూడా అంటారు. సంవత్సరం కాలం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవాలను ఆరాధించే రోజే ఈ కనుమ పండుగ. పశుపక్షాదులకు గౌరవాన్ని సూచించే పండుగగా కనుమ ప్రసిద్ధి చెందింది. ఈ కనుమ రోజు రైతులు తమ పశువులను ప్రత్యేకంగా అలంకరించి పూజించి వాటికి కృతజ్ఞతలు తెలుపుతారు.


