News August 5, 2024

ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ కన్నుమూత

image

ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గ్రాహం థోర్ప్(55) కన్నుమూశారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ప్రకటించింది. ఆయన మృతి దిగ్భ్రాంతిని కలిగించిందని తెలిపింది. గత రెండేళ్లుగా గ్రాహం అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. తన అంతర్జాతీయ కెరీర్‌ను 1993లో ప్రారంభించారు. టెస్టుల్లో 100 మ్యాచులాడి 6744 రన్స్, వన్డేల్లో 82 మ్యాచులాడి 2380 రన్స్ చేశారు. 2002లో వన్డేలు, 2005లో టెస్టుల నుంచి రిటైరయ్యారు.

Similar News

News March 19, 2026

అరుదైన బ్లడ్ గ్రూప్.. 50 మందికి మాత్రమే!

image

మనందరిలో ప్రధానంగా నాలుగు గ్రూపుల రక్తం ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా 50 మందికి మాత్రమే ఉండే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ‘Rh-Null’ అనే విషయం మీకు తెలుసా? దీనినే ‘గోల్డెన్ బ్లడ్’ అని పిలుస్తారు. ఇందులో ఏ రకమైన యాంటిజెన్లు ఉండవు, అందుకే ఈ రక్తం ఎవరికైనా సెట్ అవుతుంది. కానీ వీరికి రక్తం కావాలంటే మాత్రం దొరకడం చాలా కష్టం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో

News March 19, 2026

జ్యోతిషుడు అరెస్టు.. మహిళలతో 58 అసభ్యకర వీడియోలు

image

మహారాష్ట్రలో ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ లాంటి ఘటన సంచలనం రేపుతోంది. నాసిక్‌కు చెందిన జ్యోతిషుడు అశోక్ కారత్‌ తన వద్దకు వచ్చే మహిళలకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేసేవాడని పోలీసులు గుర్తించారు. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ దోపిడీ చేసేవాడన్నారు. అతడిని అరెస్టు చేసి 58 అసభ్యకర వీడియోలను సీజ్ చేశారు. అశోక్ గతంలో నేవీలో పని చేశాడు. ఇతడికి MH రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలతో సంబంధాలున్నాయి.

News March 19, 2026

సరఫరా కాదు డిస్ట్రిబ్యూషన్‌లోనే సమస్య: కేంద్రం

image

దేశంలో LPG సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని.. డిస్ట్రిబ్యూషన్‌లోనే సమస్య ఉందని కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే క్షేత్రస్థాయిలో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని పేర్కొంది. దీనిపై డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్రాలకు అప్పీల్ చేశామని తెలిపింది. నిన్న టోటల్ బుకింగ్స్ 56లక్షలుగా ఉండగా సప్లై సంఖ్య 54,91,000గా ఉన్నట్లు తెలిపింది.