News August 5, 2024
ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తి.. జమ్మూకశ్మీర్‌లో హైఅలర్ట్

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసి నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. సైనికులను తరలించే కాన్వాయ్‌ల రాకపోకలనూ నిలిపేసింది. కాగా ఆర్టికల్ 370ని కేంద్రం 2019 AUG 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. సుప్రీంకోర్టు సైతం ఈ నిర్ణయాన్ని సమర్థించింది.
Similar News
News October 24, 2025
విగ్రహంలో దేవుడు ఉంటాడా?

భగవంతునికి చంచల, నిశ్చల అనే రెండు రూపాలున్నాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో చలనము లేని రూపమే విగ్రహం. ఈ రూపంలో కూడా పరమాత్మ నిత్యం కొలువై ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే విగ్రహాన్ని రాతిగా చూడరాదని అంటుంటారు. భక్తుల కోసం, భక్తుల ఆరాధన కోసం భగవంతుడు తన లీల ద్వారా ఈ రూపంలో కొలువై ఉంటాడట. భక్తులచే పూజలందుకొని అనుగ్రహాన్ని కల్పిస్తాడట. విగ్రహంలో దేవుడు లేడన్న మాట అవివేకం. <<-se>>#WhoIsGod<<>>
News October 24, 2025
చిన్నారుల్లో హెయిర్ ఫాల్ అవుతోందా?

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా హెయిర్‌ఫాల్ అందర్నీ ఇబ్బంది పెడుతోంది. చిన్నారుల్లో కూడా ఈ సమస్య పెరుగుతోందంటున్నారు నిపుణులు. పిల్లల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణం పౌష్టికాహార లోపం. పిల్లలకు ఐరన్, జింక్, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే మంచి సమతులాహారం పెట్టడంతో పాటు జుట్టును గట్టిగా లాగి దువ్వడం, బిగించడం మానుకోవాలంటున్నారు. కొంతమంది పిల్లల్లో జ్వరాలు వచ్చి తగ్గాక కూడా హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది.
News October 24, 2025
19 మృతదేహాలు వెలికితీత

AP: కర్నూలు బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. బస్సులో ఇద్దరు పిల్లలు సహా మొత్తం 41 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ప్రయాణించినట్లు తెలిపారు. 21 మంది సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.


