News August 5, 2024
గత ప్రభుత్వ ఇసుక విధానంపై సీఐడీ విచారణ: సీఎం చంద్రబాబు

AP: గత ప్రభుత్వంలో అమలైన ఇసుక విధానంపై సీఎం చంద్రబాబు సీఐడీ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ‘రవాణా ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని నియంత్రించాలి. రీచ్‌కు దగ్గరగా స్టాక్ పాయింట్ ఉండాలి. గ్రామ సచివాలయం కేంద్రంగా ఇసుక రవాణా సాగాలి. ఈ విషయంలో కలెక్టర్లు, అధికారులు తప్పులు చేస్తే క్షమించం’ అని హెచ్చరించారు.
Similar News
News March 22, 2026
కొండచిలువల రక్తంలో బరువును తగ్గించే మాలిక్యూల్

బర్మీస్ కొండచిలువలు తమ శరీర బరువుకు సమానమైన ఆహారాన్ని తినగలవు. ఆ తర్వాత నెలలపాటు తిండి లేకుండా ఉండగలవు. ఇలాంటి అసాధారణ జీవక్రియకు వాటి రక్తంలోని pTOS మాలిక్యూల్ కారణమని స్టాన్‌ఫోర్డ్(US) సైంటిస్టులు గుర్తించారు. దీన్ని వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్లలో వాడొచ్చని, ఊబకాయంపై పోరాటంలో ఇదొక కీలక మలుపు అని పేర్కొన్నారు. pTOSను ఎలుకలకు ఇవ్వగా అవి తక్కువ ఆహారం తిని 28 రోజుల్లోనే 9% బరువు తగ్గాయన్నారు.
News March 22, 2026
లక్ష్యాన్ని మించి రబీ సాగు!

AP: మొంథా, దిత్వా తుఫాన్లతో భారీ వర్షాలు కురిసినా రబీ సాగుకు ఆటంకం కలగలేదు. ఈ సీజన్‌లో 20.79L హెక్టార్లలో 22 పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా ఏకంగా 27.36L హెక్టార్లలో రైతులు పంటలు వేశారు. వరి, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, అపరాలు, చిరు ధాన్యాలు, పొగాకు, నూనె గింజలను సాగు చేశారు. కృష్ణా, గోదావరి డెల్టాలతోపాటు నదులు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండటంతోనే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు.
News March 22, 2026
‘పెద్ది’లో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్?

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే సాంగ్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ కూడా స్పెషల్ సాంగ్‌లో స్క్రీన్ షేర్ చేసుకుంటారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం మృణాల్ తెలుగులో అడివి శేష్‌తో కలిసి ‘డెకాయిట్’ మూవీలో నటిస్తున్నారు.


