News August 5, 2024
ఈనెల 15న జిల్లాలో సీఎం పర్యటన: మంత్రి తుమ్మల

ఈనెల 15న ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్, స్థానిక నేతలు, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌తో కలిసి తుమ్మల సభా స్థలాన్ని పరిశీలించారు. ఈ పర్యటనలో సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 3, 2026
వెలుగుమట్ల పార్కును సందర్శించిన డీఎఫ్ఓ

ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్కును జిల్లా అటవీ శాఖాధికారి (డీఎఫ్ఓ) సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మంగళవారం సందర్శించి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. వేసవిలో అడవులను కార్చిచ్చు నుంచి రక్షించుకోవడంపై సిబ్బంది నిర్వహించిన మాక్ డ్రిల్ పరిశీలించారు. బ్లోయర్లు, ఇతర పరికరాలతో మంటలను ఎలా అదుపు చేయాలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. అడవుల రక్షణకు వేగవంతమైన ప్రతిస్పందన చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
News March 3, 2026
కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఖమ్మం కలెక్టర్

హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ సదస్సులో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, గ్రామసభల్లో లబ్ధిదారుల వివరాలు వెల్లడించాలని సీఎం సూచించారు. ఆసుపత్రులను మెడికల్ కాలేజీలతో అనుసంధానించాలని, మధ్యాహ్న భోజన బిల్లులను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. జిల్లాలో అభివృద్ధి పనుల వేగవంతంపై చర్చించారు.
News March 3, 2026
ఖమ్మం: ఇంటింటికీ నల్లా.. పంచాయతీలకే తాగునీటి బాధ్యత

ఖమ్మం జిల్లాలో తాగునీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ ‘జల్ జీవన్ మిషన్’ పథకం సిద్ధమైంది. ఈ పథకంలో భాగంగా గ్రామాల్లోని ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపులైన్ల నిర్వహణ బాధ్యతలను ఇకపై నేరుగా గ్రామ పంచాయతీలకే అప్పగించనున్నారు. సర్పంచి అధ్యక్షతన ఉండే ‘గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీల’ ద్వారా ప్రతి ఇంటికీ 100 శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చి, నిరంతర సరఫరాను పర్యవేక్షిస్తారు.


