News August 5, 2024
అదానీ వారసులు ఆన్ ద వే

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 70 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. 62 ఏళ్ల అదానీ తన తరువాతి తరం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్లూమ్‌బర్గ్‌కు తెలిపారు. ఆయన కుమారులు కరణ్, జీత్‌లతోపాటు వీరి కజిన్స్ ప్రణవ్, సాగర్‌లు ఆ బాధ్యతలు తీసుకుంటారని వెల్లడించారు. Infra, Ports, సిమెంట్, షిప్పింగ్, గ్రీన్ ఎనర్జీ, ఎయిర్‌పోర్ట్స్ రంగాల్లో గ్రూప్ విస్తరించింది.
Similar News
News September 18, 2025
రేపు కాకతీయ యూనివర్సిటీలో జాబ్ మేళా..!

యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జాబ్ మేళాలో అనేక కంపెనీలు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రిజిస్ట్రార్ సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ డా.రహమాన్ పాల్గొన్నారు.
News September 18, 2025
3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్‌ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.