News August 5, 2024

సాగునీటి రంగంలో ప్రభుత్వం విఫలం: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

image

TG: సాగునీటి రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంపై విమర్శలు, దాడులు తప్ప ఏం చేయలేదని ఎద్దేవా చేశారు. గోదావరి, కృష్ణా నుంచి లక్షలాది TMCల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందన్నారు. కాలువల ద్వారా ఆ నీటితో చెరువులను ఎందుకు నింపడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. MBNR, NLG జిల్లాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 12, 2026

ఇరాన్‌కు వ్యతిరేకంగా UNSC తీర్మానం.. భారత్ మద్దతు

image

USపై ప్రతీకారం పేరుతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను భారత్ తప్పుబట్టింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌‌ ఇరాన్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి IND సహా 135 దేశాలు మద్దతు తెలిపాయి. ఇరాన్ వెంటనే దాడులను ఆపాలని డిమాండ్ చేశాయి. ఓటింగ్‌కు చైనా, రష్యా దూరంగా ఉన్నాయి. ఈ తీర్మానాన్ని ఇరాన్ ఖండించింది. తమ పరిస్థితి రేపు మరో దేశానికి రావొచ్చని.. ఇలాంటి తప్పులు చేయొద్దని హెచ్చరించింది.

News March 12, 2026

రష్మిక మందన్న ఆగ్రహం.. కారణమిదే!

image

తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై హీరోయిన్ రష్మిక సీరియస్‌ <<19364152>>అయిన<<>> విషయం తెలిసిందే. రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ రద్దయ్యాక ఆమె తల్లి సుమన్ మందన్న ఇచ్చిన పాత ఇంటర్వ్యూను కొందరు వక్రీకరిస్తూ వార్తలు రాయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ‘గీత గోవిందం’ వివాదం, పెళ్లి తర్వాత నటన మానెయ్యాలనే ఆంక్షలు, రక్షిత్ తల్లికి సారీ చెప్పమనడం వంటి విషయాలను కన్నడ మీడియా తప్పుగా రాయడంతో ఆమె ఇలా రియాక్ట్ అయ్యారని సమాచారం.

News March 12, 2026

ఫిబ్రవరిలో పెరిగిన ద్రవ్యోల్బణం

image

దేశంలో ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.2%కు పెరిగింది. కాగా ఇది జనవరిలో 2.74%గా ఉంది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది RBI నిర్ణయించిన 2-6% టాలరెన్స్ బ్యాండ్ పరిధిలోనే ఉందని కేంద్రం తెలిపింది. ఆహార ధరలు పెరగడం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపించింది. కూరగాయలు, పప్పులు, తృణధాన్యాల ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణంపై ఎఫెక్ట్ పడింది. ఫిబ్రవరిలో ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ 3.75%గా ఉంది.