News August 5, 2024

SKLM: ఆ స్కూల్లో ఒకరే స్టూడెంట్

image

మీరు చదివింది నిజమే. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం రొట్టవలస పంచాయతీ అవతరబాద్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక విద్యార్థి మాత్రమే చదువుతున్నాడు. అతని కోసం టీచర్, పాఠశాల పారిశుద్ధ్య కార్మికురాలు, మధ్యాహ్నం భోజనం కార్మికురాలు కూడా పని చేస్తున్నారు. చిన్న గ్రామం కావడంతో స్థానికంగా ఉన్న సుమారు పదిమంది పిల్లలు సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు వెళ్లిపోతున్నారు.

Similar News

News March 4, 2026

శ్రీకాకుళం: సకాలంలో పంచాయతీ ఎన్నికలు లేనట్టే?

image

ప్రభుత్వం సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని అధికార వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2 న సర్పంచుల పదవీకాలం ముగుస్తుండటంతో, ప్రత్యేక అధికారుల నియామకానికి కసరత్తు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 912 పంచాయతీలు, 657 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. సర్పంచ్, వార్డుల రిజర్వేషన్ ఖరారు సైతం జరగలేదు. ఎన్నికలపై స్పష్టత వచ్చేవరకు ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగనుంది.

News March 4, 2026

శ్రీకాకుళం: పాలిటెక్నిక్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

పాలిటెక్నిక్ డిప్లమా ప్రవేశాల పరీక్ష పాలిసెట్-2026కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, కన్వీనర్ నారాయణరావు బుధవారం తెలిపారు. ప్రవేశ పరీక్షకు పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు అర్హులుగా చెప్పారు. https://polycetap.ap.gov. ఇన్ వెబ్సైట్లో ఏప్రిల్ 4లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పది కళాశాలలు ఉన్నాయన్నారు.

News March 4, 2026

జనసేన ఆఫీసుపై దాడి.. శ్రీకాకుళం జిల్లా యువకుడి అరెస్ట్

image

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల 2 కార్లను ధ్వంసం చేయడంతో పాటు భద్రతా సిబ్బందిపై దాడిచేసిన వ్యక్తిని మంగళవారం రిమాండ్‌కి పంపినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. పార్టీ కార్యాలయ భద్రతా సిబ్బంది RI పెంటారావు ఫిర్యాదు మేరకు కంచిలి మండలం బెలగాంకు చెందిన నీలాద్రిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారు.