News August 5, 2024

హన్మకొండ: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలి: కలెక్టర్ ప్రావీణ్య

image

పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించడం వల్ల ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్‌ ఐనవోలు మండలం పంథిని లో స్వచ్చందనం – పచ్చందనం కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామాలలో పరిశుభ్రత, పచ్చందనం పెంపొందించేందుకు 5 రోజులు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిందన్నారు.

Similar News

News March 21, 2026

మొక్కజొన్నకు రూ.2,400 మద్దతు ధర: కలెక్టర్

image

మొక్కజొన్నకు క్వింటాకు రూ.2,400 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ సత్య శారద తెలిపారు. రైతులు పంటను విక్రయించేటప్పుడు తేమ శాతం (మాయిశ్చర్) 14 లోపు ఉండేలా చూసుకోవాలని సూచించారు. రైతులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు. రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు జమ అయ్యేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.

News March 21, 2026

WGL: నాలుగు మండలాల్లోనే వర్షం

image

వరంగల్ జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షపాతం సగటున 0.9 మిల్లీమీటర్లు నమోదుకగా, జిల్లా వ్యాప్తంగా 4.9 మిల్లీమీటర్లు వర్ష పాతం నమోదైంది. జిల్లాలోని 13 మండలాల్లో సంగేంలో 1.8 మిల్లీమీటర్లు, కిలా వరంగల్‌లో 1.5 మిల్లీమీటర్లు, వరంగల్‌లో 0.8 మిల్లీమీటర్లు, గీసుకొండలో 0.8 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదుకగా, మిగిలిన 9 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.

News March 20, 2026

WGL: ‘ఈనెల 23న ఆర్ట్, క్రాఫ్ట్ ప్రదర్శనలు’

image

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఈనెల23న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌లో 7వ,8వ,9వ తరగతుల విద్యార్థులు రూపొందించిన ఆర్ట్, క్రాఫ్ట్ ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ఇందులో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి, విజేతలకు బహుమతులు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములై సృజనాత్మకతను ప్రదర్శించాలన్నారు.