News August 5, 2024

ALERT: కడప జిల్లాకు వర్ష సూచన

image

ఉమ్మడి కడప జిల్లాలో రాత్రికి అక్కడక్కడ తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ విపత్తు నివారణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వారం రోజుల క్రితం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు విత్తనాలు విత్తిన రైతులకు సహకరిస్తుందని రైతులు ఆశిస్తున్నారు.

Similar News

News January 12, 2026

‘ప్రజా సంక్షేమంలో నిర్లక్ష్యం వద్దు’

image

రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్ అధికారులు నిర్లక్ష్యం చేయరాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాలపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కడప కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

News January 12, 2026

కడప జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా

image

కడప జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా నియమితులు కానున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన అతిథి సింగ్ బదిలీ అయ్యారు. ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్‌ల బదిలీలలో భాగంగా జాయింట్ కలెక్టర్‌గా నిధి మీనా జిల్లాకు రానున్నారు. త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్‌ల బదిలీలు చోటు చేసుకున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.

News January 12, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు.!

image

* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,290
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,147
* వెండి 10 గ్రాములు ధర రూ.2,620.