News August 5, 2024

Airtel అదుర్స్: నికర లాభం డబుల్

image

భారతీ ఎయిర్‌టెల్ అదరగొట్టింది. అంచనాలను మించి ఫలితాలను విడుదల చేసింది. Q1 FY25లో నికర లాభం 128% వృద్ధిచెంది రూ.2068 కోట్ల నుంచి రూ.4717 కోట్లకు పెరిగింది.
* ఆదాయం రూ.37,599 కోట్ల నుంచి రూ.38,506 కోట్లకు పెరిగింది.
* ఎబిటా 1.8% వృద్ధితో రూ.19,365 కోట్ల నుంచి రూ.19,708 కోట్లకు పెరిగింది.
* ఎబిటా మార్జిన్ 51.5 నుంచి 52.2 శాతానికి తగ్గింది.
* మొబైల్ సర్వీసెస్ ARPU రూ.209 నుంచి రూ.211కు పెరిగింది.

Similar News

News March 15, 2026

హెల్ప్ చేస్తాం.. కానీ, మాకు డబ్బులు కావాలి: జెలెన్‌స్కీ

image

ఇరాన్‌తో తాము యుద్ధం చేయడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు <<19386678>>జెలెన్‌స్కీ<<>> అన్నారు. షాహెద్ డ్రోన్ల నుంచి పశ్చిమాసియా దేశాలను కాపాడేందుకు రక్షణ కవచంలా మారుతున్నామని తెలిపారు. రష్యా ప్రయోగిస్తున్న డ్రోన్లను కూల్చడంలో ఆరితేరిన ఉక్రెయిన్ ఇప్పుడు ఆ అనుభవాన్ని గల్ఫ్ దేశాలకు పంచుతోంది. దీనికి ప్రతిఫలంగా తమకు టెక్నాలజీ, నిధులు కావాలని జెలెన్‌స్కీ కోరారు. ఇప్పటికే ఖతర్, UAE, సౌదీకి ఎక్స్‌పర్ట్స్‌ను పంపారు.

News March 15, 2026

మోగిన ఎన్నికల నగారా.. ఫుల్ డీటెయిల్స్ ఇవే

image

తమిళనాడు, బెంగాల్, కేరళం, అస్సాం, పుదుచ్చేరి(UT)లో ఎన్నికల నగారా మోగింది. 824 నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. బెంగాల్‌లో అత్యధికంగా 294, TN-234, కేరళం-140, అస్సాం-126, పుదుచ్చేరిలో 30 స్థానాలున్నాయి. 17.4 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందుకోసం 2.19లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 25 లక్షల మంది అధికారులు ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు.

News March 15, 2026

పుట్టా మహేశ్‌ను వదిలేసిన పోలీసులు

image

TG: డ్రగ్స్ కేసులో పాజిటివ్ వచ్చిన TDP MP పుట్టా మహేశ్‌ను శంషాబాద్ రూరల్ పోలీసులు వదిలిపెట్టారు. ఆయనతో పాటు ఫామ్‌హౌస్‌లో పట్టుబడ్డ ప్రియాంక రెడ్డికి స్టేషన్ బెయిల్ మీద నోటీసులు ఇచ్చి పంపించేశారు. BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి(రోహిత్ రెడ్డి సోదరుడు), నమిత్‌ను ఉప్పరపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. నిన్న రాత్రి మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో కొకైన్ తీసుకుంటూ మహేశ్, రోహిత్ దొరికారు.