News August 5, 2024

కొత్తగా 15వేలకు పైగా ఉద్యోగాలు: సీఎం రేవంత్

image

TG: యూఎస్ఏలో కాగ్నిజెంట్ టీమ్‌తో చర్చలు విజయవంతంగా ముగిశాయని సీఎం రేవంత్ వెల్లడించారు. హైదరాబాద్‌లో కొత్త కార్యాలయం ఏర్పాటుకు ఆ సంస్థ ఒప్పుకుందని తెలిపారు. ఈ కొత్త బ్రాంచీతో 15వేలకు పైగా కొత్త ఉద్యోగాలు రానున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని టైర్-2 సిటీల్లోనూ కంపెనీని విస్తరించాలన్న తన సూచనకు ఆ సంస్థ సీఈవో రవికుమార్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Similar News

News March 8, 2026

కేజీ చికెన్ ధర ఎంత ఉందంటే?

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు ₹300కు చేరాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్‌లెస్ ₹290-300, ఆసిఫాబాద్‌లో ₹300, వరంగల్‌లో ₹290, కామారెడ్డిలో ₹280-300 పలుకుతోంది. ఏపీలోని విజయవాడలో ₹300గా ఉంది. మరోవైపు గుడ్ల రేట్లు మాత్రం భారీగా తగ్గాయి. 30 గుడ్లు ఉండే ట్రే ధర ₹130-140కి పడిపోయింది. ఇక మటన్ కేజీ ₹800-1000గా ఉంది. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.

News March 8, 2026

విశాఖ నుంచి వెళ్లిన 10 వేల కంటైనర్లు వెనక్కి!

image

AP: US&ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి <<19285220>>మూతబడటం<<>> తెలిసిందే. దీంతో విశాఖ పోర్టు నుంచి సరకులతో వెళ్లిన నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ క్రమంలో వాటిని వెనక్కి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుమారు 10 వేల కంటైనర్లు వెనక్కి వస్తాయని విశాఖ కంటైనర్ టెర్మినల్ అధికారులు అంచనా వేశారు. వాటిని ఉంచేందుకు స్థలం కేటాయించాలని పోర్టుకు లేఖ రాశారు.

News March 8, 2026

ఈమె ఎదురీత ముందు విధిరాత ఎంత!

image

పదేళ్లు వీల్‌ఛైర్‌కు పరిమితమైన యువతి సివిల్స్ ఫలితాల్లో 483వ ర్యాంకు సాధించారు. ఆమెనే కేరళకు చెందిన అథిర(30). BDS చదువుతుండగా యాక్సిడెంట్ జరగడంతో తల, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. ఛాతీ కింది భాగం ప్యారలైజ్ అయిపోయింది. రెండేళ్లు జ్ఞాపకశక్తి కూడా లేదు. ఆ తర్వాత BDS పూర్తి చేశారు. NGOలోని డిసెబిలిటీ వింగ్‌లో పనిచేయడంతో ఆత్మ విశ్వాసం పెరిగిందని, పేరెంట్స్&సిస్టర్ సాయంతో చదివానని అథిర తెలిపారు.