News August 5, 2024

పెట్టుబడుదారులకు రెడ్ కార్పెట్ పరిచాం: మంత్రి గొట్టిపాటి

image

ఏపీలో విద్యుత్ రంగానికి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి ప్రవాసాంధ్రులకు విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. జె.పంగలూరు మండల ముప్పవరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. APలో పెట్టుబడిదారులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రెన్యూవబుల్ ఎనర్జీలో పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరిచామని, విద్యుత్ రంగంలో పెట్టుబడి పెట్టే సంస్థలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధం ఉందని తెలియజేశారు.

Similar News

News March 6, 2026

మార్కాపురం జిల్లా వైద్యశాలలో వేధిస్తున్న డాక్టర్ల కొరత

image

మార్కాపురం జిల్లా వైద్యశాలలో డాక్టర్లు, వైద్య పరికరాలు, సరైన యంత్రాలు లేక పేషెంట్లకు వైద్యం అందడం లేదు. ఎర్రగొండపాలెం, గిద్దలూరు ప్రాంతాలలో పేషెంట్లను ఎమర్జెన్సీ వైద్య సదుపాయం కోసం జిల్లా వైద్యశాలకు డాక్టర్లు రిఫర్ చేస్తారు. ఇక్కడ సరైన వైద్య సదుపాయం లేకపోవడంతో ఒంగోలు రిమ్స్‌కు రిఫర్ చేయడం పరిపాటిగా మారింది. ఇప్పటికైనా జిల్లా వైద్యశాలలో పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించాలని పేషెంట్లు కోరుతున్నారు.

News March 6, 2026

మాచవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

image

కనిగిరి మున్సిపల్ పరిధిలోని మాచవరం వద్ద గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పిడుగురాళ్లకు చెందిన సాతులూరి రాంబాబు (45) గా స్థానికులు గుర్తించారు. ఈయన కొంతకాలంగా పచ్చాకు కూలీగా పనిచేస్తున్నాడు. స్థానికులు విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

News March 6, 2026

10th విద్యార్థులకు RTC బస్సుల్లో ఉచితం: మార్కాపురం DM

image

మార్కాపురంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి సంస్థ అనుమతించినట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి తిరిగి వెళ్లేందుకు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. కండక్టర్‌కు బస్సు పాస్‌తో సంబంధం లేకుండా హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుందన్నారు.