News August 5, 2024
ఘరానా మోసగాడు.. ఎట్టకేలకు అరెస్టయ్యాడు

చలపతిరావు HYDలోని ఓ SBI బ్రాంచిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసేవాడు. ఫేక్ పేపర్లతో తన బంధువులకు ₹50లక్షలు లోన్ ఇప్పించాడు. 2004లో అతడిపై ఛార్జిషీట్ దాఖలైంది. దీంతో ప్లాన్ వేసి భార్యతో ‘భర్త కనిపించడం లేదు. చనిపోయినట్లు ప్రకటించండి’ అని పిటిషన్ వేయించగా కోర్టు ఆమేరకు ఉత్తర్వులిచ్చింది. అతడేమో వేషాలు, పేర్లు మార్చుకొని తిరుగుతున్నాడు. జీమెయిల్, Ph నం. ఆధారంగా అతడిని తాజాగా పోలీసులు పట్టుకున్నారు.
Similar News
News March 10, 2026
క్యూఆర్ కోడ్ స్కాన్ ఇష్యూ.. CBSE ఏమందంటే?

12వ తరగతి <<19342594>>మ్యాథ్స్ క్వశ్చన్<<>> పేపర్ వివాదంపై CBSE స్పందించింది. కొన్ని ప్రశ్నాపత్రాల్లో క్యూఆర్ కోడ్ తప్పు వచ్చినట్లు ఒప్పుకుంది. క్వశ్చన్ పేపర్ తయారీ, భద్రతలో రాజీ పడబోమని వెల్లడించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనలను గుర్తించామంది. ఈ విషయాన్ని అంతర్గతంగా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వివరించింది. భవిష్యత్తు పరీక్షలలో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పింది.
News March 10, 2026
T20WC గెలుపు.. పెళ్లికి సిద్ధమైన భారత క్రికెటర్

T20WC గెలుపు సంతోషంలో ఉన్న భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ పెళ్లికి సిద్ధమయ్యారు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో ఈ నెల 14న ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఏడడుగులు వేయనున్నారు. మార్చి 17న లక్నోలో రిసెప్షన్ జరగనుంది. వీరికి గతేడాది జూన్ 4న ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. నవంబర్‌లో మ్యారేజ్ జరగాల్సి ఉండగా T20WC ప్రిపరేషన్స్ కోసం కుల్దీప్ వాయిదా వేశారు.
News March 10, 2026
GREAT: కష్టకాలంలో భారతీయులకు అండగా..

యుద్ధం కారణంగా విమానాలు నిలిచిపోయి దుబాయ్‌లో ఇబ్బంది పడుతున్న భారతీయులకు అండగా నిలిచారు ఇండియన్ బిజినెస్‌మెన్ యోగేష్ దోషి. హోటల్ ఖర్చులను భరించలేని సుమారు 125 మంది ప్రయాణికుల కోసం తన 64 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్‌మెంట్ భవనాన్ని కేటాయించారు. వారికి ఉచిత వసతితో పాటు ఆహారం, వైద్య సదుపాయాలను కూడా కల్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈయనపై నెట్టింట అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


