News August 5, 2024

ఖడ్గవలస: ప్రధాన రహదారిపై ఏనుగుల గుంపు

image

పార్వతీపురం-కురుపాం ప్రధాన రహదారిలోని ఖడ్గవలస కూడలిలో ఉన్న రైస్ మిల్లు వద్ద ఏనుగుల గుంపు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. ప్రధాన రహదారిపై ప్రయాణించేవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏనుగుల గుంపు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. పరిసర ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప రహదారుల పైకి రావద్దని సూచించారు.

Similar News

News November 11, 2025

VZM: సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలకు అప్లై చేశారా?

image

సఫాయి కర్మచారి యువతకు 3 సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు సబ్సిడీపై ఇవ్వనున్నారు.
➤యూనిట్ విలువ: రూ.31,67,326
➤సబ్సిడీ: రూ.14,16,831
➤రుణ మొత్తం: రూ17,50,495, వడ్డీ రేటు: 6%
➤చెల్లింపు కాలం: 72 నెలలు (ప్రతి నెల రూ.33,064 వాయిదా)
➤గ్రూప్: 5 మంది అభ్యర్థులు ఉండాలి
➤అప్లై చేసే స్థలం: జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ, మర్రి చెన్నారెడ్డి భవనం, కంటోన్మెంట్, విజయనగరం
➤చివరి తేదీ: 20-11-2025

News November 11, 2025

గృహలబ్ధిదారుల వివరాలు నమోదు చేయండి: DRO

image

గృహాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలను సర్వే చేసి అర్హత ఉన్న వారి వివరాలను యాప్‌లో నమోదు చేయాలని DRO శ్రీనివాసమూర్తి సోమవారం ఆదేశించారు. నవంబర్ 30 వరకు ప్రభుత్వం సర్వేకు సమయం ఇచ్చిందని, లబ్ధిదారుల సర్వే పూర్తి చేసి అప్లోడ్ చేయాలని తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు సచివాలయాల తనిఖీ చేసి ప్రొఫార్మాలో వివరాలను నమోదు చేసి సమర్పించాలని సూచించారు.

News November 10, 2025