News August 6, 2024

బంగ్లా వీడిన షేక్ హసీనా.. ప్రెసిడెంట్ కీలక నిర్ణయం

image

షేక్ హసీనా దేశం విడిచి, తన పదవికి రాజీనామా చేయడంతో బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ప్రధాని, ప్రతి పక్ష నేత ఖలేదా జియా విడుదలకు ప్రెసిడెంట్ మహ్మద్ షహబుద్దీన్ ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు పార్లమెంటును రద్దు చేశారు. అంతేకాకుండా విద్యార్థి నిరసనల్లో అరెస్టైనవారికి స్వేచ్ఛ కల్పించాలని ఆర్మీ ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించారు. కాగా ఖలేదా అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

Similar News

News March 24, 2026

GK: స్వాతంత్య్ర సమరయోధులు – రచనలు

image

☛ మహాత్మా గాంధీ – సత్యశోధన (My Experiments with Truth)
☛ జవహర్‌లాల్ నెహ్రూ – ది డిస్కవరీ ఆఫ్ ఇండియా
☛ బాల గంగాధర్ తిలక్ – గీతా రహస్యం (Karma-Yoga Shastra)
☛ లాలా లజపతిరాయ్ – అన్‌హ్యాపీ ఇండియా
☛ డా. బి.ఆర్. అంబేడ్కర్ – అనైలేషన్ ఆఫ్ కాస్ట్, థాట్స్ ఆన్ పాకిస్థాన్
☛ మౌలానా అబుల్ కలాం ఆజాద్ – ఇండియా విన్స్ ఫ్రీడమ్
☛ సుభాష్ చంద్రబోస్ – ది ఇండియన్ స్ట్రగుల్
☛ సరోజినీ నాయుడు- ది గోల్డెన్ త్రెషోల్డ్

News March 24, 2026

IPL: అత్యల్ప స్కోరు ఆర్సీబీదే!

image

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు(287) రికార్డు సన్ రైజర్స్ హైదరాబాద్ పేరిట <<19457522>>ఉంటే<<>>.. అత్యల్ప స్కోర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నమోదు చేసింది. 2017లో కోల్‌కతా(KKR)పై బెంగళూరు (RCB) చేసిన 49 రన్స్ నేటికీ లీగ్ చరిత్రలో అత్యల్పం. ఆ తర్వాత వరుసగా రాజస్థాన్ రాయల్స్ (58, 59), ఢిల్లీ (66, 67) పరుగులతో ఉన్నాయి. 2008లో ముంబై బౌలర్ల ధాటికి KKR కూడా 67 పరుగులకే కుప్పకూలింది.

News March 24, 2026

పశ్చిమాసియా సంక్షోభం.. కేంద్ర మంత్రుల కీలక భేటీ

image

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పార్లమెంటు హౌస్‌లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కీలక భేటీ జరుగుతోంది. ఈ మీటింగ్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఎరువుల మంత్రి నడ్డా హాజరయ్యారు. మరోవైపు ఇదే అంశంపై రేపు ఆల్ పార్టీ మీటింగ్‌కు కేంద్రం <<19464829>>పిలుపునిచ్చిన<<>> విషయం తెలిసిందే.