News August 6, 2024

MBNR: అరుణాచల గిరికి ప్రత్యేక బస్సు.. ఫోన్ చేయండి !

image

తమిళనాడులోని అరుణాచలగిరి ప్రదక్షిణకు మహబూబ్ నగర్ డిపో నుంచి ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. ఆగస్టు 17న రాత్రి 7 గంటలకు ఇక్కడి నుంచి బస్సు బయలుదేరుతుందని, అరుణాచలేశ్వరస్వామి గిరిప్రదక్షిణ పూర్తయ్యాక 19న మధ్యాహ్నం అక్కడి నుంచి తిరుగుపయనమవుతుందని, రూ.3,600 టిక్కెట్ ఛార్జీగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వివరాలకు 99592 26285, 94411 62588 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Similar News

News November 8, 2025

MBNR: ఈనెల 10, 11న ఖో-ఖో ఎంపికలు

image

మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 బాల, బాలికల ఖో-ఖో జట్ల ఎంపికలను డీఎస్ఏ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్. శారదాబాయి తెలిపారు. ఈ నెల 10న అండర్-14, 11న అండర్-17 ఎంపికలు జరుగుతాయన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్ జిరాక్స్‌లతో ఉదయం 9 గంటలలోపు పీడీ మొగులాల్ (99859 05158)ను సంప్రదించాలని సూచించారు.

News November 7, 2025

హిందువులు సత్తా చాటాలి: MP డీకే అరుణ

image

2 లక్షలకు పైగా ఉన్న హిందువులంతా ఏకమై జూబ్లీహిల్స్ ఊప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి సత్తా చాటాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా బోడబండలో నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి చేయలేదని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని ఆమె విమర్శించారు.

News November 7, 2025

దళితులైతే దాడులు చేస్తారా?: మందకృష్ణ మాదిగ

image

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయిపై కాలు, బూటుతో దాడి చేయడాన్ని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా ఖండించారు. ఆయన దళితుడు అయినందువల్లే ఇలాంటి దాడులకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17న నిర్వహిస్తున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని పీయూ నుంచి భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.