News August 6, 2024

విజయనగరం: ఫేక్ మెసేజ్‌తో రూ.5.30 లక్షలు కాజేత

image

విజయనగరం ఎం.జి.రోడ్డులో నివసిస్తున్న యువతి ఇన్‌స్టాగ్రాంకు వచ్చిన ‘ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్’ అనే మెసేజ్‌కు స్పందించింది. ఆ తర్వాత వాట్సాప్‌లో ఎన్82 మిహర్ వోహ్రా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ’ గ్రూప్ ద్వారా వచ్చిన వాటిని నమ్మి, అధిక మొత్తంలో డబ్బులు వస్తాయన్న ఆశతో మొత్తం రూ.5,30,000 నగదు పంపించారు. తర్వాత అటువైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News

News April 2, 2026

VZM: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఎస్‌బీఐ ఆర్‌సెటీ ద్వారా గ్రామీణ మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ భాస్కరరావు తెలిపారు. ఈ నెల 6 నుంచి టైలరింగ్, ఎంబ్రాయిడరీ &ఫ్యాబ్రిక్ పెయింటింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ కోర్సులు నిర్వహిస్తామన్నారు. 18-50 ఏళ్ల వయస్సు గల మహిళలు 9959521662 నంబర్‌కు ఫోన్ చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. భోజనం,వసతి ఉచితమని, ఏప్రిల్ 5లోగా దరఖాస్తు చేయాలని సూచించారు.

News April 1, 2026

VZM: తాగునీటి వేసవి ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

image

వేసవి కాలంలో గ్రామాలు, పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో సురక్షిత తాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో తాగునీటి వేసవి ప్రణాళికపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆర్‌ఓ ప్లాంట్లు లేని పాఠశాలలు, వసతి గృహాల జాబితా సిద్ధం చేసి అవసరమైన చోట జల జీవన్ మిషన్ ద్వారా కుళాయిల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

News April 1, 2026

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంకులు మెరుగుపరచాలి: VZM కలెక్టర్

image

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు మున్సిపాలిటీలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, ప్లాస్టిక్ కవర్ల విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.