News August 6, 2024

ఇన్వెస్ట‌ర్లు వెయిట్ అండ్ వాచ్‌

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్ టైం హైలో ఉన్న ప‌రిస్థితుల్లో ప్రైస్ క‌రెక్ష‌న్ అయ్యే అవ‌కాశాలు ఉన్నందునా ఇన్వెస్ట‌ర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా మాంధ్యం భ‌యాలు, ఇజ్రాయెల్‌-ఇరాన్ ఘర్షణ, వ‌డ్డీ రేట్ల పెంపు, ఎన్నిక‌లు ముగియ‌డం, కేంద్రం పూర్తి స్థాయి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం, కార్పొరేట్ ఫ‌లితాల వెల్ల‌డి వ‌ల్లే ప్రైస్ కరెక్షన్ అవుతున్నట్టు క‌నిపిస్తోంది.

Similar News

News March 3, 2026

కలెక్టర్లూ ఇదేం తీరు… CM సీరియస్

image

TG: అధికారుల పనితీరుపై CM రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాల్లో భూ వివాదాలకు కలెక్టర్లే కారణమని అసంతృప్తి వ్యక్తంచేశారు. జిల్లా కేంద్రంలో ఉండకుండా HYD నుంచి రాకపోకలు సాగిస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని ముగ్గురు కలెక్టర్లపై మండిపడ్డారు. ఇప్పటికే కొంతమందిని బదిలీ చేశామని, ఇంకా మారకపోతే ఇబ్బందులు తప్పవని కలెక్టర్ల కాన్ఫరెన్సులో హెచ్చరించారు.

News March 3, 2026

సంపాదనలో కొంచెమైనా దాచుకోండి: పరుచూరి

image

ప్రస్తుత కాలంలో చాలామంది వృథా ఖర్చులతో డబ్బును సేవ్ చేసుకోవట్లేదు. ఈక్రమంలో దీనిపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘గుండు సూదితో భూమిని సేద్యం చేయాలనుకోవడం ఎంత కష్టమో.. సంపాదించిన డబ్బును ఖర్చు చేయడం చేతిలో నీళ్లు నేలపై ఒలికించినంత తేలిక. అందుకే సంపాదనలో కొంచెమైనా దాచుకోవడం మంచిది. ఆ పొదుపే మీ వృద్ధాప్యంలో కామధేనువులా అండగా ఉంటుందని తెలుసుకోండి’ అని చెప్పుకొచ్చారు.

News March 3, 2026

ఫేస్ రికగ్నిషన్‌తోనే ఇకపై పథకాలు: CM

image

TG: అనర్హులకు పథకాలు చేరకుండా, ఒక్కరికే రెండుసార్లు లబ్ధి చేకూరకుండా ఇకపై ఫేస్ రికగ్నిషన్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగాలని CM రేవంత్ ఆదేశించారు. ప్ర‌తి ప‌థ‌కానికీ దీన్ని వర్తింప చేయాలని స్పష్టం చేశారు. ‘అర్హుల‌కు క‌చ్చితంగా ల‌బ్ధి జరగాలి. అదే స‌మ‌యంలో అన‌ర్హులు ల‌బ్ధిపొంద‌కూడ‌దు. ఆస‌రా పింఛ‌న్ల‌లో ముఖ గుర్తింపు చేప‌ట్ట‌డంతో 3L మంది అన‌ర్హులను తొల‌గించ‌గ‌లిగాం’ అని కలెక్టర్ల కాన్ఫరెన్సులో చెప్పారు.