News August 6, 2024

వాంకిడి: కడుపు నొప్పితో విద్యార్థిని ఆత్మహత్య

image

కడుపునొప్పి భరించలేక వాంకిడి మండలానికి చెందిన యువతి ఆత్మహత్య చేసుకుందని ఎస్సై సాగర్ తెలిపారు. బెండార గ్రామానికి చెందిన సోనీ(20) హైదరాబాద్‌లో GNM సెకండియర్ చదువుతోంది. గతేడాదిగా ఆమె కడుపునొప్పితో భాదపడుతోంది. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన ప్రయోజనం లేకపోయింది. దీంతో సోమవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

Similar News

News March 13, 2026

ADB: స్కాలర్ షిప్స్ నేరుగా అకౌంట్‌లో జమ

image

జిల్లాలోని ఎస్సీ విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి గాను చెల్లించాల్సిన బోధన రుసుములు (ట్యూషన్ ఫీజులు) ఉపకార వేతనాలను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత కుమారి తెలిపారు. మంజూరైన డబ్బుల్లో విద్యార్థుల నిర్వహణకు కొంత డబ్బులు మినహాయించుకొని మిగతా మొత్తాన్ని ట్యూషన్ ఫీజు కింద కళాశాలలకు చెల్లించాలని సూచించారు.

News March 13, 2026

ADB: గ్యాస్ బుకింగ్ హెల్ప్‌లైన్ నంబర్ ఇదే

image

గ్యాస్ రీఫిల్లింగ్ గడువును 15 రోజుల నుంచి 20 రోజులకు పెంచామని.. దీంతో ఎలాంటి కొరత ఉండబోదని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. జిల్లాలో సిలిండర్ల స్టాక్ తగినంతగా అందుబాటులో ఉందని వివరించారు. ప్రజలు అనవసరంగా భయాందోళనతో గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కట్టవద్దని కోరారు. బుకింగ్ లేదా సరఫరలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదుకై టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1939ను సంప్రదించాలని సూచించారు.

News March 13, 2026

ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుపై వీడని ఉత్కంఠ

image

ADB విమానాశ్రయ భూసేకరణ వ్యవహారం గందరగోళంగా మారింది. బ్లూప్రింట్ సిద్ధమైందని నేతలు చెబుతుండగా, తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని కలెక్టర్‌ స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది. రన్‌వే విస్తరణకు 249.81 ఎకరాలు అవసరం కానుంది. దీంతో భూములు ఎటువైపు పోతాయో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనతో బాధితుల్లో భయం పెరిగింది. స్పష్టత ఇవ్వాలని ప్రజలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.