News August 6, 2024
SRPT: ఒకేసారి అన్నా చెల్లికి ప్రభుత్వ ఉద్యోగాలు

అన్నా చెల్లెలు ఒకే సారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులతో పాటు బంధువులను ఆనందోత్సవాలతో ముంచారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన సమ్మెట విజయ్ కుమార్, రేణుక ఎల్లమ్మల కుమారుడు రాహుల్ గౌడ్, కుమార్తె ఐశ్వర్య ఉన్నారు. వీరు ఇటీవల వెలువడిన ఫలితాలలో రాహుల్ పంచాయతీ రాజ్‌లో ఏఈఈ, ఐశ్వర్య పబ్లిక్ హెల్త్‌లో ఏఈఈ ఉద్యోగం పొందారు.
Similar News
News January 3, 2026
NLG: నీటి వాటాలో ‘తెలంగాణ’కు ద్రోహం: మంత్రి ఉత్తమ్

కృష్ణ, గోదావరి జలాల పంపిణీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను పనంగా పెట్టిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే జలాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, చుక్క నీటిని కూడా బయటకు పోనివ్వబోమని స్పష్టం చేశారు.
News January 3, 2026
కేసీఆర్ వదిలిన రాజకీయ బాణం కవిత: కోమటిరెడ్డి

మాజీ సీఎం కేసీఆర్ వదిలిన రాజకీయ బాణంగా కవిత వ్యవహరిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న నేతలను దూరం చేసేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. కవిత అసలు బీఆర్ఎస్లో ఉన్నారో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌పై విమర్శలకే స్పందిస్తున్న ఆమె.. హరీశ్‌రావుపై వస్తున్న ఆరోపణల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని మంత్రి ప్రశ్నించారు.
News January 3, 2026
NLG: టీచర్లకు పరీక్ష.. విద్యార్థులకు బోధన ఎలా?

జిల్లా కేంద్రంలో రేపటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. టెట్ రాసేందుకు చాలా మంది ఇన్ సర్వీస్ టీచర్లు ఫీజు కట్టారు. కొంతమంది వచ్చే విడతలో చెల్లించి రాయాలని చూస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. టెట్ పరీక్ష రోజున ఉపాధ్యాయులందరూ స్కూల్‌ను విడిచి వెళ్లే పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వేర్వేరు తేదీల్లో 6 రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. 1,557 మంది ఉపాధ్యాయులు పరీక్షలకు వెళ్లనున్నారు.


