News August 6, 2024

మధిర: గల్లంతైన మృతదేహం లభ్యం

image

మధిర రైల్వే బ్రిడ్జి సమీపంలోని వైరా నదిలో నిన్న అద్దంకి రవీంద్రా అనే యువకుడు ఈతకు వెళ్లి <<13783729>>గల్లంతైన <<>>విషయం తెలిసిందే. నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టినా మృతదేహం లభ్యం కాలేదు. కాగా, ఈరోజు ఉదయం గాలింపు చర్యలను మొదలుపెట్టిన పోలీసు అధికారులు ఎట్టకేలకు మృతదేహం లభ్యమైనట్లు వెల్లడించారు. రవీంద్ర మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Similar News

News March 14, 2026

ఖమ్మం: ఎస్సీ సబ్సిడీ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలో 2025–26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద సబ్సిడీ పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ నెల 17 నుంచి 24 వరకు tsobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంపుల పంపిణీలో గిగ్ కార్మికులకు ప్రాధాన్యత ఉంటుందని, అర్హులైన ఎస్సీ యువత అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News March 14, 2026

ఖమ్మంలో ఆర్టీసీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ దరఖాస్తులు

image

టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఎం సరీరామ్ తెలిపారు. బీఎస్సీ, బీకాం, బిబిఏ, బీసీఏ, బీఏతో పాటు ఇంజనీరింగ్ డిప్లమా పూర్తి చేసిన అభ్యర్థులు అప్రెంటిషిప్‌కు అర్హులని చెప్పారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

News March 14, 2026

వలస కార్మికుల వివరాలపై కేంద్రాన్ని కోరిన ఎంపీ రఘురాంరెడ్డి

image

విదేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వలస కార్మికుల గణాంకాలను వెల్లడించాలని ఎంపీ రఘురాంరెడ్డి లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రం నుంచి వెళ్లిన పురుష, మహిళా కార్మికుల వివరాలతో కూడిన సమగ్ర డేటాబేస్ అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరిటా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వలస కార్మికుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు.