News August 6, 2024
ఒంగోలు: ITIలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో మూడవ విడత ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులను ఈనెల 26వ తేదీలోగా నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లాలో ఒకటికంటే ఎక్కువ ఐటీఐ కళాశాలలను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News November 4, 2025
ప్రకాశం: మద్యం దుకాణాల లైసెన్సుల కొరకు.. దరఖాస్తుల ఆహ్వానం!

జిల్లాలోని పొదిలి, దర్శి, కనిగిరి, కంభం ఎక్సైజ్ స్టేషన్లో పరిధిలో 4 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆయేషా బేగం తెలిపారు. జిల్లాలోని ఒంగోలు, చీమకుర్తి, సింగరాయకొండ, పొదిలి, దర్శి, మార్కాపురం, కనిగిరి, వై పాలెం, గిద్దలూరు, కంభం స్టేషన్ల పరిధిలో ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా పదో తేదీలోగా దరఖాస్తులను సమర్పించవచ్చన్నారు. 12న ఒంగోలులో లాటరీ తీస్తామన్నారు.

News November 3, 2025
రేపు ప్రకాశం జిల్లాకు వర్ష సూచన

ప్రకాశం జిల్లాలో మంగళవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ సోమవారం ప్రకటించింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో చెట్లకింద నిలబడరాదని సంస్థ ఎండి ప్రఖర్ జైన్ సూచించారు. అలాగే రైతులు వ్యవసాయ మోటార్ల వద్ద జాగ్రత్త వహించాలన్నారు.