News August 6, 2024

అసలైన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్

image

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చివరి శ్వాస వరకూ పోరాడిన వ్యక్తి ప్రొ.జయశంకర్. 1934లో WGL(D) అక్కంపేటలో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో ముఖ్యమైన పదవులు చేపట్టిన ఆయన జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నారు. సమైక్య పాలనలో TGకి జరిగిన అన్యాయంపై కేసీఆర్ సహా ఎందరినో చైతన్యవంతం చేశారు. జనాన్ని జాగృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. నేడు ఆయన జయంతి.

Similar News

News March 16, 2026

సల్మాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టైటిల్ ఛేంజ్

image

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ సినిమా పేరు మారింది. దీనికి ‘మాతృభూమి- may war rest in peace’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు సల్మాన్ Xలో పోస్టర్ షేర్ చేశారు. గల్వాన్ ఘర్షణలో వీరమరణం పొందిన తెలుగు సైనికుడు కల్నల్ సంతోష్ బాబు పాత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల టీజర్ విడుదల కాగా చైనా నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే టైటిల్ మార్చినట్లు సమాచారం.

WOW.. 189 ఏళ్ల తర్వాత కనిపించిన అరుదైన మొక్క

image

అరుణాచల్ ప్రదేశ్‌లో 189 ఏళ్ల క్రితం కనుమరుగైన ‘హెన్కెలియా మోనోఫిల్లా’ అనే అరుదైన మొక్కను శాస్త్రవేత్తలు తిరిగి గుర్తించారు. లోహిత్ జిల్లాలో బోటానికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని కనుగొంది. రాష్ట్రంలోని అద్భుతమైన జీవవైవిధ్యానికి ఇది నిదర్శనమని సీఎం పెమా ఖండూ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆవిష్కరణ రాష్ట్రంలోని అసాధారణ జీవవైవిధ్యాన్ని, పర్యావరణ సంపదను ప్రపంచానికి చాటిచెబుతుందని కొనియాడారు.