News August 6, 2024

జయశంకర్ సార్ ఆశయాలకు తెలంగాణ కట్టుబడి ఉంది: ఎంపీ చామల

image

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ సేవలను తెలంగాణ ప్రజలు స్మరించుకుంటారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని వారి సేవలను ఎంపీ గుర్తు చేసుకున్నారు, తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం తపించి, రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ అన్నారు.

Similar News

News March 2, 2026

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఉపాధి హామీపై కలెక్టర్ సీరియస్

image

జిల్లాలో రానున్న కఠిన వేసవిని దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తక్షణమే మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయాలన్నారు. ముఖ్యంగా విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్‌ల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News March 2, 2026

మార్చి 31లోగా లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్

image

ఆర్థిక సంవత్సరం ముగియనున్న తరుణంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ముఖ్యంగా LRS దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మార్చి 31 లోగా నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు.

News March 2, 2026

హోలీ రోజు డ్రంకెన్ డ్రైవ్ తనీఖీలు: ఎస్పీ శరత్ చంద్ర పవార్

image

హోలీ పండుగ రోజు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. మహిళల రక్షణ కోసం ‘షీ టీమ్స్’ నిరంతరం పహారా కాస్తాయని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజలందరూ ఇతరులకు హాని కలగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఎస్పీ సూచించారు.