News August 6, 2024

కూతురి స్ఫూర్తితో వీగన్‌గా మారా: CJI

image

క్రూరత్వం లేని జీవితాన్ని గడపాలని తన కూతురు చెప్పిందని CJI జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ఆమె స్ఫూర్తితో తాను వీగన్‌గా మారినట్లు చెప్పారు. ‘మొదట డెయిరీ ఉత్పత్తులు, తేనె తీసుకోవడం మానేశా. జంతువులకు హాని కలిగించి తయారు చేసిన వస్తువులనూ ధరించొద్దని ఆమె చెప్పింది. దీంతో నేను, నా భార్య సిల్క్, లెదర్ ప్రాడక్ట్స్‌నూ కొనుగోలు చేయట్లేదు’ అని పేర్కొన్నారు.

Similar News

News January 5, 2026

మీ గుమ్మానికి ‘స్వస్తిక్’ గుర్తు ఉందా?

image

స్వస్తిక్ సానుకూల శక్తి, శుభానికి సంకేతం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగి అదృష్టం వరిస్తుందని జ్యోతిషులు చెబుతున్నారు. స్వస్తిక్ వేసిన చోట పరిశుభ్రత పాటించాలని, అక్కడ బూట్లు, చెప్పులు ఉంచకూడదని అంటున్నారు. ఇది ఎరుపు రంగులో ఉంటే అదృష్టమని, ఇంట్లోకి ప్రతికూల శక్తి రాకుండా నిరోధించవచ్చని సూచిస్తున్నారు. సుఖశాంతులు, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని నమ్మకం.

News January 5, 2026

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌లో 50 పోస్టులు

image

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML)లో 50 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు ఎల్లుండి (JAN 7)వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, డిప్లొమా, CA, ICWA, MBA, ME, ఎంటెక్, MSW, MA, PhD(హిందీ), LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అసెస్‌మెంట్/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.bemlindia.in/

News January 5, 2026

నల్లమల సాగర్‌పై SCలో విచారణ

image

పోలవరం, నల్లమలసాగర్ ప్రాజెక్ట్‌పై TG ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై SC CJI ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘AP వరద జలాలే వాడుకుంటామని చెబుతోంది. కేటాయింపులకు విరుద్ధంగా నీళ్లను వాడుకోవడం అసాధ్యం. దీనికి అనేక విషయాలు ముడిపడి ఉన్నాయి. తెలంగాణ అనేది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ప్రాజెక్టులన్నీ ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి’ అని సింఘ్వీ పేర్కొన్నారు.