News August 6, 2024
బెయిల్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్న కవిత

ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను MLC కవిత వెనక్కి తీసుకున్నారు. లిక్కర్ పాలసీ స్కామ్‌కు సంబంధించి CBI కేసులో ఆమె బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. నిన్న సీనియర్ న్యాయవాది కోర్టుకు హాజరుకాకపోవడంతో విచారణ వాయిదా వేయాలని ఆమె తరఫు లాయర్ కోరారు. పదే పదే వాయిదాలు కోరడంతో జడ్జి అసహనం వ్యక్తం చేశారు. వాదనలు వినిపించకపోతే పిటిషన్ విత్‌డ్రా చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 28, 2026
ASF జిల్లాలో మాస్ కాపీయింగ్ కలకలం

జిల్లాలోని ఏజెన్సీ గురుకులాల్లో పదో తరగతి ఫలితాల కోసం కొందరు ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందంజలో నిలపాలనే సాకుతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మైక్రో జిరాక్స్‌లు తీసి CRPల ద్వారా పరీక్షా కేంద్రాలకు చేరవేస్తున్నట్లు సమాచారం. జిల్లా యంత్రాంగం మొక్కుబడిగా తనిఖీలు చేసి ఊరుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
News March 28, 2026
పాత్రలు కడిగే లిక్విడ్స్‌తో ఆరోగ్యానికి ముప్పు!

పాత్రలు కడిగే లిక్విడ్స్‌లో ఉండే ఐసోథియాజోలినోన్ వంటి రసాయనం వల్ల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా క్లీన్ చేయని పాత్రలపై ఇవి ఉండిపోవడం వల్ల చర్మ వ్యాధులు, అలర్జీలు, జీర్ణకోశ సమస్యలు తలెత్తవచ్చని వివరించారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్నపిల్లలపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. వీటికి బదులుగా రసాయనాలు లేని <<19500089>>ప్రత్యామ్నాయాలు<<>> వాడాలని సూచించారు.
News March 28, 2026
పాత్రల జిడ్డు వదిలించే వంటింటి చిట్కాలు!

పాత్రల జిడ్డు వదిలించేందుకు రసాయనాలతో కూడిన సబ్బులే వాడాల్సిన పనిలేదు. వంటింట్లో ఉండే వస్తువులతోనూ పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు. నిమ్మరసం, బేకింగ్ సోడా మిశ్రమం మొండి జిడ్డును వదిలిస్తుంది. వెనిగర్ వాడటం వల్ల బాక్టీరియా నశించి పాత్రలు మెరుస్తాయి. అలాగే బియ్యం కడిగిన నీరు, బూడిదను వాడి పాత్రలను క్లీన్ చేయొచ్చు. వీటివల్ల చేతులకు అలర్జీలు రావు. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? COMMENT


