News August 6, 2024
PMగా ఆఖరి నిమిషాల్లో హసీనా ఏం చేశారంటే..

అల్లరి మూకలు చుట్టుముడుతున్న సమయంలో PMగా చివరి నిమిషాల్లో షేక్ హసీనా ఏం చేశారు? ఆమె సన్నిహిత వర్గాల ప్రకారం.. వెంటనే బయలుదేరాలని మధ్యాహ్నం 1.30కి భద్రతా సిబ్బంది హసీనాకు చెప్పారు. జాతినుద్దేశించి ప్రసంగించాలన్న ఆమె కోరికను తోసిపుచ్చారు. 1.45 PMకి ప్లానింగ్ కమిషన్ భవనానికి, అక్కడి నుంచి పాత తేజ్‌గావోన్ ఎయిర్‌పోర్టుకు సోదరితో సహా హసీనాను తరలించారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో భారత్‌కు పంపించారు.
Similar News
News September 18, 2025
లిక్కర్ స్కాం.. 20 చోట్ల ఈడీ తనిఖీలు

ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో బోగస్ పేమెంట్లకు సంబంధించి లావాదేవీలు చేసిన వారి సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2025
పాలు పితికే సమయంలో పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పాలు పితకడానికి ముందు గేదె/ఆవు పొదుగు, చనులను గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. పాలు పితికే వ్యక్తి చేతులకు గోళ్లు ఉండకూడదు. చేతులను బాగా కడుక్కొని పొడిగుడ్డతో తుడుచుకున్నాకే పాలు తీయాలి. పొగ తాగుతూ, మద్యం సేవించి పాలు పితక వద్దు. పాల మొదటి ధారల్లో సూక్ష్మక్రిములు ఉంటాయి. అందుకే వేరే పాత్ర లేదా నేలపై తొలుత పిండాలి. పాలను సేకరించే పాత్రలను శుభ్రంగా ఉంచకపోతే తీసిన పాలు త్వరగా చెడిపోతాయి.
News September 18, 2025
మహిళా వ్యాపారవేత్తల కోసం ట్రెడ్ స్కీమ్

మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ఒకటే ట్రెడ్. మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఇందులో మహిళలకు తయారీ, సేవలు, వ్యాపార రంగాల్లో కావాల్సిన రుణం, శిక్షణ వంటి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 30 శాతం వరకు ప్రభుత్వం గ్రాంట్ కింద అందజేస్తుంది. మొత్తం రూ.30 లక్షల వరకు బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయి.