News August 6, 2024

3వ ప్రపంచ యుద్ధం మొదలైంది: జ్యోతిష్కుడు

image

నిన్నటి నుంచి మూడో ప్రపంచ యుద్ధం మొదలైందని జ్యోతిష్కుడు కుశాల్ కుమార్ జోస్యం చెప్పారు. హరియాణాలోని పంచ్‌కులకు చెందిన ఆయన గతంలో రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలను ముందుగా అంచనా వేశారు. పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న క్రమంలో ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధంపైనా ఆయన జోస్యం చెప్పడం చర్చనీయాంశంగా మారింది. హమాస్ చీఫ్‌ హత్యతో ఇజ్రాయెల్, ఇరాన్‌, హెజ్బొల్లా మధ్య నిప్పురాజుకున్న సంగతి తెలిసిందే.

Similar News

News March 19, 2026

సౌదీ అరామ్‌కో రిఫైనరీపై ఇరాన్ దాడి

image

ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తి, ఎగుమతిదారు అయిన సౌదీకి చెందిన అరామ్‌కో రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. నష్ట తీవ్రతపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని తెలిపారు. ‘సౌత్ పార్స్’పై అటాక్‌కు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ వరుస <<19422796>>దాడులు<<>> చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

News March 19, 2026

కాసేపట్లో వర్షం..

image

TG: వచ్చే రెండు గంటల్లో (4.30PM వరకు) పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపారు. వికారాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

News March 19, 2026

‘ధురంధర్’ డైరెక్టర్ గురించి తెలుసా?

image

‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య ధర్ పేరు మారుమోగుతోంది. ఇతడు కశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందినవారు. 1983లో ఢిల్లీలో జన్మించారు. క్రికెటర్ కావాలని కలలు కన్నా ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల వదిలేశారు. ముంబైకి వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. 2019లో ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ అనే సినిమాతో సంచలనం సృష్టించారు. 2021లో హీరోయిన్ యామీ గౌతమ్‌ను పెళ్లి చేసుకోగా 2024లో కుమారుడు జన్మించాడు.