News August 6, 2024

కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలో బస్ డ్రైవర్లు నిరసన

image

కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలో హైర్ బస్సుల డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం డ్యూటీలో జాయిన్ అయిన ఓ డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయడం పట్ల హైర్ బస్సు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు డ్రైవర్ తాను మద్యం సేవించనని, అలవాటు లేదని చెప్తున్నా వినలేదని ఆరోపించారు. హైర్ బస్సుల డ్రైవర్ల ఆందోళనతో సమీప గ్రామాలకు వెళ్లే బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

Similar News

News March 12, 2026

KNR: ఆర్ఎంపీ కళ్లలో కారం కొట్టి గొలుసు అపహరణ

image

తిమ్మాపూర్ మండలం నేదునూరులో ఆర్ఎంపీ తమ్మనవేణి కొమరయ్యపై దుండగుడు దాడికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి విధి నిర్వహణ ముగించుకొని వస్తుండగా, జెన్కో సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగి.. అకస్మాత్తుగా కొమరయ్య కళ్లలో కారంపొడి చల్లాడు. ఈ క్రమంలో కొమరయ్య వద్ద నుంచి 12 గ్రాముల బంగారు గొలుసు, నగదు ఎత్తుకెళ్లి మామిడి తోటలోకి పారిపోయాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

News March 12, 2026

కరీంనగర్‌ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు

image

కరీంనగర్(D)లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళన చెందకుండా ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకోవాలన్నారు. సింగిల్‌ సిలిండర్‌కు 25 రోజులు, డబుల్‌కు 15 రోజుల గడువు ఉంటుందని తెలిపారు. గ్యాస్‌ పొందే సమయంలో ఓటీపీ తప్పనిసరిగా చెప్పాలన్నారు. కృత్రిమ కొరత సృష్టించినా, డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 11, 2026

KNR: ‘డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్‌కు దూరంగా ఉండాలి’

image

డ్రగ్స్, గంజాయి, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి అలవాట్లు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, అడిషనల్ డీసీపీ వేంకటరమణ తెలిపారు. డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యువతలో అవగాహన కల్పించేందుకు విడుదల చేసిన కరపత్రాన్ని వారు KNRలో ఆవిష్కరించారు. మత్తు పదార్థాలు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ తదితరులు ఉన్నారు.