News August 6, 2024
పీయూ RTF కోర్సు ఫీజులు విడుదల చేయాలి !

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలో రెండు సంవత్సరాల నుంచి విద్యార్థులకు RTF కోర్సు ఫీజులు విడుదల కాలేదు. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులు ముందుకు సాగడం లేదు. అటు స్కాలర్షిప్ ఇటు కోర్స్ ఫీజులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీయూ అధికారులు స్పందించి RTFలను విడుదల చేయాలని విద్యార్థులు అధికారులను కోరుతున్నారు.
Similar News
News March 25, 2026
మహబూబ్‌నగర్: ఉడిత్యాలలో అత్యధిక వర్షపాతం!

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో అకాల వర్షం కురిసింది. బాలానగర్ మండలం ఉడిత్యాలలో అత్యధికంగా 25.5 మి.మీ వర్షపాతం నమోదైంది. మిడ్జిల్‌లో 7.3, దోనూరులో 4.5, రాజాపూర్‌లో 2.8 మి.మీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షాల వల్ల మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

MBNR: ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్: ఎస్పీ

న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు ఈనెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి పిలుపునిచ్చారు. కోర్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసులను రాజీ మార్గంలో, తక్కువ ఖర్చుతో సులభంగా పరిష్కరించుకునేందుకు ఇది ఉత్తమ మార్గమని ఆమె పేర్కొన్నారు. ఇరుపక్షాల అంగీకారంతో సమస్యలు సమసిపోతాయని ఎస్పీ వెల్లడించారు.