News August 6, 2024
వరంగల్: భారీ ధర పలుకుతున్న మక్కలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధర భారీగా పలుకుతూ రైతన్నలకు సంతోషం కలిగిస్తున్నాయి. గత నెల మొదటివారంలో రూ.2,780 రికార్డు ధర పలికిన క్వింటా మొక్కజొన్న(మక్కలు) స్వల్పంగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. గత వారం రూ.2,680 పలికిన మక్కల ధర.. నేడు(మంగళవారం) రూ.2,715 కి పెరిగిందని అధికారులు తెలిపారు.
Similar News
News August 29, 2025
వరంగల్ జిల్లాలో తగ్గుముఖం పట్టిన వర్షాలు

రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఉదయం 6 గంటల వరకు మొత్తం 29.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. వరంగల్ మండలంలో 11.2 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. ఖిల్లా వరంగల్‌లో 5.5మి.మీ, ఖానాపూర్‌లో 1.8, నల్లబెల్లిలో అత్యల్పంగా 0.5 మి.మీ వర్షపాతం నమోదయింది.
News August 29, 2025
వరంగల్: గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితా ప్రదర్శన..!

వరంగల్ జిల్లాలోని 317 గ్రామ పంచాయతీలలో ఆయా గ్రామాల వారిగా జీపీ కార్యాలయాల ఎదుట కార్యదర్శులు ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న వివిధ పార్టీలకు చెందిన నాయకులతో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మీటింగ్‌లు ఏర్పాటు చేసి ఓటర్ల జాబితాపై పూర్తిగా వివరించారు. ఈనెల 30లోపు వివిధ పార్టీల నాయకులు జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా తెలియజేయాలని సూచించారు.
News August 28, 2025
WGL: గణేష్ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సీపీ

హనుమకొండ జిల్లాలోని వచ్చే నెల 5న నిర్వహించనున్న గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ పరిశీలించారు. హనుమకొండలోని కాజీపేట బంధం చెరువు, సిద్ధేశ్వర గుండం, హసన్‌పర్తి చెరువులను ఆయన సందర్శించి, నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఆయనతో పాటు సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, స్పెషల్ బ్రాంచ్ ట్రాఫిక్ ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.