News August 6, 2024
మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో నిందితులను అరెస్టు చేయండి

మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం కేసులో నిందితులను అరెస్టు చేయాలని మదనపల్లె కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రెడ్డి సాహెబ్ డిమాండ్ చేశారు. సబ్ కలెక్టరేట్లో నిరసన తెలిపారు. గత నెల 21న గుర్తుతెలియని వ్యక్తులు రెవెన్యూ రికార్థులు దగ్ధం చేసిన విషయం తెలిసిందే. ఫైళ్ల దగ్ధం జరిగి 15 రోజులు గడుస్తున్న నిందితులను గుర్తించడం, అరెస్టు చేయడంగానిచేయలేదని అన్నారు. అనంతరం ఏవోకు వినతి పత్ర ఇచ్చారు.
Similar News
News March 24, 2026
చిత్తూరు DMHOగా నాగ శశిభూషణ్ రెడ్డి

చిత్తూరు డీఎంహెచ్ఓగా నాగ శశిభూషణ్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఇది వరకు అనంతపురం జిల్లా డీఐవోగా పని చేశారు. ఈ జీవోలో ప్రస్తుత డీఎంహెచ్ఓ సుధారాణిని ఎక్కడకు బదిలీ చేశారు పేర్కొనలేదు.
News March 24, 2026
చిత్తూరు: కన్నతండ్రిపై కుమారుడి దాడి

కన్న తండ్రిపై కుమారుడు దాడి చేసిన ఘటన పుంగనూరు మండలంలో చోటుచేసుకుంది. రాంనగర్‌కు చెందిన భాస్కర్ రాజు కుమారుడు గోవర్ధన్‌కు ఏడాది క్రితం వివాహం చేశారు. దంపతుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. సామరస్యంగా ఉండాలని సూచించడంతో కుమారుడు తండ్రిని ఇంటి నుంచి గెంటేశాడు. దీనిపై మళ్లీ పంచాయతీ పెట్టి, కోడలి పట్ల అనుకూలంగా మాట్లాడటంతో గోవర్ధన్ తండ్రిపై దాడి చేశాడు. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు.
News March 24, 2026
చిత్తూరు: సమస్యలు తెలుసుకున్న కలెక్టర్

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. సమస్యలపై అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడల్, డీఆర్ఓ మోహన్ కుమార్ పాల్గొన్నారు.


