News August 6, 2024
తెలంగాణలో విమాన సేవలు పెంచండి: కొత్త ప్రభాకర్ రెడ్డి

తెలంగాణలో విమాన సేవల పెంపుపై దృష్టి సారించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడిని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని వారి కార్యాలయంలో కలిసి పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడిని కలిశారు. తెలంగాణ లో విమాన సేవల పెంపుపై దృష్టిసారించాలని కోరారు.
Similar News
News March 11, 2026
మహిళలు ఆర్థిక అంశాలపై పట్టు సాధించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్ కలెక్టరేట్‌లో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రతిమా సింగ్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక అంశాలపై పట్టు సాధించి స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. మహిళల హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
News March 11, 2026
MDK: నాగ్సాన్‌పల్లి శివారులో మహిళ హత్య..?

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి శివారులో మహిళ మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాలిలా.. కొడుపాక గ్రామానికి చెందిన బ్యాగరి సులోచన(35) సోమవారం కూలీ పనులకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం చెలిమకుంట వద్ద ఆమె మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ముఖంపై కర్రతో దాడి చేసిన గాయాలు ఉండడంతో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు చెప్పారు.
News March 11, 2026
ఫైల్ క్లియరెన్స్ వేగవంతం చేయాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మంగళవారం కలెక్టరేట్‌లోని వివిధ శాఖల సెక్షన్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫైల్ క్లియరెన్స్ వేగవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో స్వచ్ఛత, పరిశుభ్రత పనులను తనిఖీ చేసి నిరుపయోగ వస్తువులు, పరికరాలను తొలగించాలని ఆదేశించారు.


